మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Mahabubnagar - Aug 10, 2020 , 02:32:18

పేదలను ‘డబుల్‌' హ్యాపీగా ఉంచుతాం

పేదలను ‘డబుల్‌' హ్యాపీగా ఉంచుతాం

  • పారదర్శకంగా డబుల్‌బెడ్రూం ఇండ్ల పంపిణీ
  • మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
  • బాదేపల్లిలో డబుల్‌బెడ్రూం ఇండ్లు ప్రారంభం,  480 ఇండ్లకు శంకుస్థాపన

  జడ్చర్ల టౌన్‌ : రాష్ట్రంలోని గూడులేని పేదలందరికీ డబుల్‌బెడ్రూం ఇండ్లు అందించి వారిని డబుల్‌ హ్యాపీ గా ఉంచాలన్నదే సీఎం కేసీఆర్‌ ఉద్దేశమని మాజీ మం త్రి, జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్‌ లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మహబూబ్‌నగర్‌ జిల్లా బాదేపల్లి పట్టణంలోని మాధవరావు కాంపౌండ్‌ సమీపంలో రూ.40 లక్షలతో నిర్మించిన 8 డబుల్‌బెడ్రూం ఇండ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. అంతకుముందు జడ్చర్ల పట్టణ శివారులోని జిల్లా పోలీస్‌ శిక్షణా కేంద్రం సమీపంలో రూ.26 కోట్లతో నిర్మించనున్న 480 డబుల్‌ బెడ్రూం ఇండ్లకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ జడ్చర్ల పట్టణంలో 1500 ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయని, త్వరలోనే పూర్తయి పేదలకు అందనున్నాయన్నారు. రాజకీయాలు, పైరవీలకు తావు లేకుండా పారదర్శకంగా అర్హులకు ఇండ్లను పంపిణీ చేస్తామన్నారు. ఇండ్ల కోసం భూములు ఇచ్చిన వారితో పాటు జడ్చర్ల రహదారి విస్తరణలో ఇండ్లు కోల్పోయిన వారికి డబుల్‌ బెడ్రూమ్స్‌ కేటాయిస్తామని హామీ ఇచ్చారు. దేశంలో ఏ రాష్ట్రంలో డబుల్‌ బెడ్రూం పథకం లేదన్నారు. గత ప్ర భుత్వాలు ఇచ్చిన ఇండ్లతో లబ్ధిదారులు అప్పుల పాల య్యే వారని, తెలంగాణ ప్రభుత్వం వారి కలలను సాకారం చేస్తోందన్నారు. 

ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ప్రజలే తిప్పి కొడతారని అన్నారు. పాలమూరు ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి జిల్లా సస్యశ్యామ లం అవుతుందన్నారు. మిషన్‌ భగీరథ నీళ్లు అన్ని గ్రా మాలకు పుష్కలంగా అందుతున్నాయన్నారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉం డాలని సూచించారు. కార్యక్రమంలో సంగీత, నాటక అకాడమీ చైర్మన్‌ బాద్మి శివకుమార్‌, డీసీఎంఎస్‌ చై ర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మురళి, విండో అధ్యక్షుడు సుదర్శన్‌గౌడ్‌, హౌసింగ్‌ ఓఎస్‌డీ రమణారావు, ఈఈ భాస్కర్‌, తాసిల్దార్‌ లక్ష్మీనారాయ ణ, ఎంపీడీవో జగదీశ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ సునీత, సర్పంచ్‌ బుక్కా వెంకటేశం, వాల్యానాయక్‌, జంగ య్య, రఘుపతిరెడ్డి, సీతారాం, లక్ష్మయ్య, ఇంతియా జ్‌, దేవా, రవీందర్‌, వార్డు సభ్యులు పాల్గొన్నారు.


logo