గద్వాల, అక్టోబర్ 21 : వానకాలంలో రైతులు పండించిన ధాన్యం దళారులకు అమ్మి నష్టపోకుం డా ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటుం ది. రైతులు పండించిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టింది. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఈ వానకాలం రైతులు పం డించిన పంటకు క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
వాస్తవంగా యాసంగి సీజన్లోనే రైతులు పండించిన పంటకు బోనస్ ఇవ్వాల్సి ఉండగా.. ప్రభుత్వం ఇవ్వకుండా మొండి చేయి చూపించింది. సన్న, దొడ్డు రకానికి క్వింటాకు రూ.500బోనస్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం మాట తప్పింది. రైతుల నుంచి వ్యతిరేకత రావడం తో ఈ వానకాలంలో రైతులు సాగు చేసిన వరి ధా న్యానికి బోనస్ ఇవ్వాలని నిర్ణయించి సన్న, దొడ్డు వడ్ల కొనుగోలు కేంద్రాలు వేర్వేరుగా ఏర్పాటు చే యాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో ఆ దిశగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
జిల్లాలో సాగు నీరు పుష్కలంగా ఉండడంతో రై తులు పత్తి తర్వాత వరి పంటను ఎక్కువ మొత్తం లో సాగు చేస్తారు. వానకాలం సీజన్లో వర్షాలు సక్రమంగా కురువకపోవడంతో జిల్లాలో వరిసాగు తక్కువ మొత్తంలో రైతులు సాగు చేశారు. వానకా లం సీజన్లో వర్షాలు సమృద్ధిగా కురువడంతో రైతులు 86,119 ఎకరాల్లో వరిపంటను సాగు చే శారు. సాగు చేసిన రైతులు కేంద్రాలకు సుమారు లక్ష మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం కేంద్రాలకు తీ సుకొస్తారని వ్యవసాయ శాఖ అధికారుల అంచనా. అందుకోసం పీఏసీసీఎస్ ఆధ్వర్యంలో 21, ఐకేపీ ఆధ్వర్యంలో 34 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.
ప్రభుత్వం రైతులకు ఇచ్చినమాట ప్రకారం రైతులు పండించిన ధాన్యానికి బోనస్‌గా రూ. 500 చెల్లిస్తే జిల్లాలోని రైతులకు రూ.50కోట్ల మేర లబ్ధి చేకూరనుంది. ప్రభుత్వం వరి ధాన్యం ఏ-గ్రేడ్ రకానికి రూ.2,320, సాధారణ రకానికి రూ.2,300 చెల్లించడంతోపాటు సన్నరకం వడ్లకు అదనంగా క్వింటాకు రూ.500 వరకు చెల్లించడానికి ఏర్పాట్లు చేస్తుండడంతో రైతులకు కొంతమేర ఊరట కలిగే అవకాశం ఉన్నది.