ఎండబెట్లలో విద్యుత్ అధికారుల దౌర్జన్యం
విద్యుత్ అధికారుల దౌర్జన్యానికి ఓ రైతు తన పొలం లో 20 ఏళ్లుగా పెంచుకుంటున్న టేకుచెట్లు నేలమట్టం చేసిన ఘటన నాగర్కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని ఎండబెట్ల గ్రామ శివారులో చోటు చేసుకున్నది. విద్యుత్ అధికారులు టేకు చెట్లను నేలమట్టం చేసిన తీరును చూసిన రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
- ట్రీ కటింగ్ పేరుతో రైతు పొలంలో 16 టేకు చెట్లు నేలమట్టం
- 20 ఏళ్లుగా కాపాడుతూ వచ్చిన చెట్లను కొట్టినవైనం
- నష్టపరిహారం అందించాలని రైతు డిమాండ్
నాగర్కర్నూల్, జూలై 3 : విద్యుత్ అధికారుల దౌర్జన్యానికి ఓ రైతు తన పొలం లో 20 ఏళ్లుగా పెంచుకుంటున్న టేకుచెట్లు నేలమట్టం చేసిన ఘటన నాగర్కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని ఎండబెట్ల గ్రామ శివారులో చోటు చేసుకున్నది. విద్యుత్ అధికారులు టేకు చెట్లను నేలమట్టం చేసిన తీరును చూసిన రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎండబెట్ల గ్రామానికి చెందిన శేవకుల గాడి బుచ్చన్న 46 ఇ సర్వే నెంబర్లోని తన వ్యవసాయ పొలం గెట్టు మీదుగా 20 ఏళ్ల కిందట టేకు మొక్కలను నాటుకున్నాడు. అప్పటి నుంచి నీళ్లకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా పోతనీటితో వాటిని పెంచి పెద్ద చేశాడు. గతంలో పొలాల మీదుగా ఉన్న విద్యుత్ లైన్ను ఐదేండ్ల కిందట బుచ్చన్న టేకు చెట్లు నాటిన గెట్టుమీదుగా ఏర్పాటు చేశారు.
అప్పట్లో సర్దుకుపోయిన సదరు రైతు ప్రతి ఏడాది వైర్లకు తాకకుండా కొమ్మలను మాత్రమే కొట్టి వేయించేవాడు. అయితే తీగలకు తాకుతున్నాయన్న కారణం చూపి ట్రీకటింగ్ పేరుతో ఎల్సీ తీసుకొని విద్యుత్ అధికారులు, ముందు పొలాల రైతులు కుమ్మకై తీగలకు తగులుతున్న కొమ్మలను కొట్టాల్సి ఉండగా, సదరు రైతుకు సమాచారం కానీ, నోటీసు కానీ ఇవ్వకుండా గత బుధవారం ఏకంగా జేసీబీతో 16 టేకు చెట్లను నేలకూల్చారు. ఈ విషయంలో విద్యుత్ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించి ముందు పొలాల రైతులకు సహకారంతో చెట్లను కూల్చివేశారు. ఈ విష యం తెలుసుకున్న సదరు రైతు బుచ్చన్న అతని భార్య ప్రభావతమ్మ శుక్రవారం పొలం వద్దకు వెళ్లి నేలకూలిన టేకు చెట్ల ను చూసి కన్నీరు మున్నీరుగా విలపించా రు.
నాటిన రోజుల్లో నీళ్లకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా పోతనీటితో పెంచి పెద్ద చేశామని, ఇంత పెద్ద చెట్లను ఎందుకు పనికిరాకుండా చేశారని, విద్యుత్ లైన్లో ఎల్సీ ఇచ్చిన సమయంలో అక్కడే ఉండి చూసుకోవాల్సిన అధికారులు పత్తా లేకుండా పోవడంతో ఇష్టానుసారంగా చెట్లను కూలదోశారని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై విద్యుత్ అధికారులను సంప్రదించగా తమకు ఎలాంటి సంబంధం లేద ని తప్పించుకుంటున్నారని, ఈ విషయ మై ఫారెస్టు అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు సదరు రైతు తెలిపారు. రైతుకు జరిగిన నష్టంపై పూర్తి విచారణ జరిపించాలని, చెట్లను తొలగించవద్దనే నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకొని, తనకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని రైతు వేడుకుంటున్నాడు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

