గద్వాల, సెప్టెంబర్ 11 : గద్వాల నియోజకవర్గ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని, అభివృద్ధి కార్యక్రమాలకు పుష్కలంగా నిధులు విడుదల చేస్తున్నారని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి తెలిపారు. శనివారం తన క్యాంపు కార్యాలయం లో శనివారం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 14న మున్సిపల్ శాఖ మం త్రి కేటీఆర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నట్లు తెలిపారు. సుమారు రూ.106 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు చెప్పారు. గద్వాలలో విద్యను ప్రోత్సహించాలనే సంకల్పతో సీఎం కేసీఆర్ నర్సింగ్ కళాశాల మంజూరు చేశారని, త్వరలో ఐఐఐటీ, మెడికల్ కళాశాల కూడా ఏ ర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఉనికి కాపాడుకోవడానికి, ప్రజలను తప్పుదోవ పట్టించడానికి కొందరు గద్వాల మెడికల్ కళాశాల కోసం ఉద్యమం చేస్తున్నారన్నారు. ధరూర్ మండలంలోని జూరాల వద్ద పార్కుకు, గోన్‌పాడ్ వద్ద షాదీఖానకు, ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలో అదనపు తరగతి గదులకు, జిల్లా గ్రంథాలయానికి, ఇం డోర్ ఆడిటోరియం, మున్సిపాలిటీలో సీసీరోడ్లు, కమ్యూనిటీ హాళ్లు, ఇంటిగ్రేటెడ్ మా ర్కెట్, ఆర్టీసీ ప్రాంగణ నిర్మాణాలకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేస్తారన్నారు. సం గాల చెరువు వద్ద నిర్మించిన పార్కు, ఆర్వోబీ, నదీఅగ్రహారం వద్ద నూతనంగా నిర్మించిన పీజీ కళాశాల వసతి గృహాలను ప్రారంభిస్తారన్నారు. మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, సబితాఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్, కొ ప్పుల ఈశ్వర్ తదితరులు హాజరవుతారన్నారు. సాయంత్రం మూడు గంటలకు మా ర్కెట్ యార్డు ఆవరణలో మంత్రి కేటీఆర్ బహిరంగ సభ ఉంటుందని, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్, పీఏసీసీఎస్ చైర్మన్ సుభాన్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రామేశ్వరి, కౌన్సిలర్ రాజు, నాయకులు వెంకట్రామిరెడ్డి, గోవింద్ తదితరులు పాల్గొన్నారు.