అచ్చంపేట/అచ్చంపేట టౌన్, జూన్ 9 : జే ఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల్లో అచ్చంపేటకు చెందిన శివ్వా రామ్నాగ ప్రజిత్, అరవింద్‌నాయక్ ప్రతిభ కనబర్చారు. ప్రజిత్ ఆలిండియా జనరల్ కేటగిరీలో 117వ ర్యాంక్ సాధించగా అరవింద్‌నాయక్ ఎస్టీ కేటగిరీలో 33వ ర్యాంక్ సాధించారు. ఈ సందర్భంగా ప్రజిత్ తల్లిదండ్రులు శి వ్వా రాధిక, సత్యనారాయణ మాట్లాడుతూ తమ కుమారుడు మాదాపూర్‌లో ఇంటర్ పూర్తి చేసి జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఉత్తమ ఫలితం సాధించాడన్నారు. పాండునాయక్ బిజినేపల్లి గురుకుల పాఠశాలలో పనిచేస్తుండగా.. అతడి కుమారుడు జేఈఈ ఫలితాల్లో ర్యాంక్ సాధించి ఐఐటీలో సీటు సాధించాడు. ఈ సందర్భంగా అరవింద్‌కు తల్లిదండ్రులు స్వీట్లు తినిపించారు. అరవింద్ 1 నుంచి 7వ తరగతి వరకు అచ్చంపేట, టెన్త్, ఇంటర్ ఆదిబట్లలోని చైతన్య జూనియర్ కళాశాలలో చదివాడు. ఐఏఎస్ సాధించాలనేది తన లక్ష్యమని అరవింద్‌నాయక్ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు రాజకీయ నాయకులు, పలు సంఘాలు, ఆర్యవైశ్య పెద్దలు ప్రజిత్తోపాటు అతడి తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు.