వనపర్తి, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ) : అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో యువత ఓటు హక్కుపై దృష్టి నిలిపింది. కేంద్ర ఎన్నికల కమిషన్ సూచన మేరకు 18 ఏళ్లు నిండిన యువత కొత్తగా ఓటు నమోదును చేసుకున్నది. అయితే ఈ నెల 30 వరకు అర్హత ఉండి లిస్టులో పేర్లు లేని వారిని నమో దు చేసుకోవాలని ఇంకా ఓటు నమోదుకు ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించింది. దీనికి సంబంధించిన వెబ్సైట్ సహకరించినందునా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఇ ప్పటికే ఎన్నికల సంఘం ప్రకటించిన కొత్త ఓటరు లిస్టు ఆధారంగా వనపర్తి నియోజకవర్గంలో దాదాపు కొత్తగా 10, 411 మంది యువతీ యువకులు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. ఇలా కొత్తగా ఓటు హక్కు పొందడం ప్రాముఖ్యతగా కనిపిస్తుంది. కాగా ఇటీవల దరఖాస్తు చేసుకున్న పలువురు కొత్త యువ ఓటర్లను ‘నమస్తే తెలంగాణ’ పలుకరించింది. తెలంగాణలో బాగా పని చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికే తమ ఓటు అంటూ పలువురు యువ ఓటర్లు అభిప్రయాలు వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు ఏర్పాట్లకు సంబంధించిన పనులను ఎన్నికల సంఘం చకచకా చేపట్టింది. అధికారులు, సిబ్బంది ఏర్పా ట్లు, ఈవీఎంలు, భద్రతా చర్య లు, ఓటర్ల జాబితా ప్రచురణలు, కొత్త ఓటర్ల నమో దు ఇతర ప్రక్రియలను పూర్తి స్థాయిలో సిద్ధం చేసే దిశగా ఎన్నికల కమిషన్ వేగం గా చర్యలు తీసుకుంటున్నది. అయితే వనపర్తి నియోజకవర్గంలో యువతీ, యువకులు కొత్త గా ఓటు హక్కు కోసం భారీగానే దరఖాస్తులు చేసుకున్నారు. దాదాపు 10, 411 మంది యువత ఓటు హ క్కు పొం దింది. నియోజకవర్గం లో మొత్తం 2,65, 622 మంది ఓటర్లు ఉండగా.. పురుషులు 1,32,971 మంది, మహిళలు 1,32, 644 మంది ఉన్నారు.
కొత్త ఓటర్లు 10 వేల మంది
అసెంబ్లీ ఎన్నికలకు యువ ఓటర్లు ఆసక్తిగానే తమ పేర్లను నమోదు చేయించుకున్నారు. 18 ఏండ్లు నిండిన యువతీ యువకులకు ఎన్నికల సంఘం ఓటు హ క్కు కోసం అవకాశం కల్పించింది. అసెం బ్లీ ఎన్నికల నేపథ్యంలో కొత్త ఓటర్ల చేరికలపై ఎన్నికల సంఘం ప్రధాన దృష్టి సారించింది. ఎన్నికలు వచ్చినప్పుడల్లా కొత్త ఓటరు నమోదు ను ఎన్నికల కమిషన్ టార్గెట్ గా తీసుకొని పూ ర్తి చేస్తున్నది. ఈ క్రమంలో ఓటు హక్కు ప్రాధాన్యతను తెలిసేలా చైతన్యం కల్పిస్తుండడంతో యువతీ, యువకులు కొత్త ఓటర్లుగా మారారు.
పని చేసే ప్రభుత్వానికే మద్దతు
పనిచేసే ప్రభుత్వానికే తమ తొలి ఓటు ను వినియోగించుకుంటామని కొత్తగా నమో దు చేసుకున్న ఓటర్లు చెబుతున్నా రు. 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటంతో రాష్ర్టా న్ని సాధించిన బీఆర్ఎస్, అదే ఉద్యమ స్పూర్తి తో గడచిన తొమ్మిదేళ్ల పాలనలో ప్రతి ఇం టికీ సంక్షేమ పథకాలు అందించిందని తెలిపారు. సీఎం కేసీఆర్ సక్సెస్ఫుల్ పాలన అందించారని, అ న్ని వర్గాల ప్రజలకు మేలు జరిగిందన్నారు. గతంలో రాజకీయపార్టీలు కేవలం హామీలను పరిమితమయ్యేవని, కానీ సీఎం కేసీఆర్ చేసి చూ పించారని చెప్పారు. ప్రతి కుటుంబం ఏదో రూపంలో ప్రభుత్వ నుం చి సాయం పొందిందని వారి మనోగతాన్ని వెల్లడించారు.
ప్రతి ఇంటికీ పథకాలు
సంక్షేమ పథకాలు అందని ఇళ్లంటూ లేదు.ఆసరా పింఛన్, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, రైతుబీమా, దళితబంధు, బీసీ బంధు, 24 గంటల నిరంతర కరెంట్, కొత్త జీపీల ఏర్పాటు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, సబ్సిడీ గొర్రెలు, ఉచిత చేప పిల్లల పంపిణీ, ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహా రం, సన్న బియ్యం భోజనం, గురుకులాల విద్యాబోధన, వసతులు, పోడు భూములకు పట్టాల పంపిణీ ఇలా.. చెప్పుకుంటూపోతే ఎన్నో పథకాలను విజయవంతంగా అమలు చేశారని అందరూ ప్రశంసిస్తున్నారు. దీంతో బీఆర్ఎస్కు ప్రజల్లో ఉన్న ఆదరణ అర్థమవుతున్నది.
నా మొదటి ఓటు మంత్రి నిరంజన్‌రెడ్డికే..
నాకు ఊహ తెలిసిన తర్వాత తెలంగాణ రాష్ర్టానికి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండే. మా కుటుంబ సభ్యులు చెప్పేవారు తెలంగాణ రాకముందు బతుకులు బాగలేకుండే.. సీఎం కేసీఆర్ వచ్చినాక బతుకులు మంచిగా అయినాయని చెప్తుండేవారు. వనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి నిరంజన్‌రెడ్డి సీఎం కేసీఆర్ సహకారంతో మా ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. అప్పుడే అనుకున్న రాష్ర్టానికి కేసీఆర్సారు ముఖ్యమంత్రిగా ఉండాలి, వనపర్తి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా మంత్రి నిరంజన్‌రెడ్డి ఉండాలనుకున్నా. అందుకే నాకు వచ్చిన మొదటి ఓటు అవకాశం బీఆర్ఎస్కే వేస్తాను.
– లోకేశ్, జగత్పల్లి, పెద్దమందడి మండలం
సంక్షేమ ఫలాలు నచ్చాయి
తెలంగాణలో సీఎం కేసీఆర్ సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు బాగున్నాయి. ముఖ్యంగా ఆసరా ఫించన్, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ తదితర పథకాలు ఎంతో మంచిగా ఉన్నాయి. పథకాలు అందని కుటుంబమమే లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో వ్యవసాయానికి, మధ్య తరగతి ప్రజలకు ఇబ్బందులు తొలిగిపోయాయి. నా మొదటి ఓటును బీఆర్ఎస్ పార్టీకి వేసి మంత్రి నిరంజన్‌రెడ్డి గెలుపులో భాగస్వామినవుతా.
– దివ్య, విద్యార్థిని జగత్పల్లి, పెద్దమందడి మండలం