అచ్చంపేట రూరల్ : మహాబూబ్‌నగర్ (Mahabubnagar ) జిల్లా అచ్చంపేట మండలం చెన్నారం గేటు సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీ కొన్న ఘటనలో 10 గొర్రెలు ( Goats ) మృతి చెందగా మరో 20 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. జాతీయ రహదారి శ్రీశైలం -హైదరాబాద్ జాతీయరహదారిపై ( National Highway) జరిగిన ఘటనలో అమ్రాబాద్ మండలం మాధవన్ పల్లి గ్రామానికి చెందిన వెంకటేష్ గొర్రెల మేత కోసం గొర్రెలను తీసుకొని వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీ కొందని తెలిపారు. ఈ ప్రమాదంలో మూడు లక్షల నష్టం వాటిల్లిందని బాధితుడు పేర్కొన్నారు. ఈ విషయం పై అచ్చంపేట పోలీసులకు వివరణ కోరగా తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని పేర్కొన్నారు.