మాగనూరు, ఫిబ్రవరి 18: పదో తరగతి పరీక్షల్లో ప్రతి ఒక్కరూ 10/10 ఫలితాలు సాధించేలా విద్యాభ్యాసం కొనసాగించాలని విద్యార్థులకు మాగనూరు ఇన్చార్జ్ ఎంఈఓ అనిల్ గౌడ్ సూచించారు. మంగళవారం మాగనూరు మండల పరిధిలోని నేరడగం బైరంపల్లి పాఠశాలలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల పదో తరగతి విద్యార్థులతో అనిల్ కుమార్ మాట్లాడుతూ వచ్చే పదో తరగతి పరీక్షల్లో 10/10 సాధించి పాఠశాలకు మరియు మీ తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్టలు సంపాదించి పెట్టాలని విద్యార్థులకు సూచించారు.
ఉపాధ్యాయులు కూడా పరీక్షలు దగ్గర పడుతున్నందున పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉపాధ్యాయులకు అనిల్ కుమార్ సూచించారు. అనంతరం బైరంపల్లి పాఠశాల రికార్డులను పరిశీలించారు. ఉపాధ్యాయుల సమయపాలన పాటించాలన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం మాత్రమే వడ్డించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సీఆర్సీ ఎల్లా గౌడ్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.