
జడ్చర్ల, ఆగస్టు 6 : తెలంగాణ సిద్ధాంతకర్త ది వంగత ప్రొఫెసర్ జయశంకర్ సార్ అందరికీ స్ఫూర్తిదాయకమని సంగీత, నాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్ అన్నారు. జడ్చర్ల పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో శుక్రవారం టీఆర్ఎస్ ఆధ్వర్యంలో జయశంకర్ సార్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాద్మి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జయశంకర్ సార్ అలుపెరగని పోరాటం చేశారని గుర్తు చేశారు. ఆయన ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు. అదేవిధంగా ఎంపీడీవో కార్యాలయంతోపాటు వివిధ గ్రామాల్లో జయశంకర్ జయంతి నిర్వహించారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్‌చైర్మన్ యాద య్య, మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ కొంగళి జంగయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రఘుపతిరెడ్డి, నాగిరెడ్డి, ఇమ్మూ, గిరి, శ్రీకాంత్‌రెడ్డి, శంకర్‌నాయక్, కౌన్సిలర్ లత, ఎంపీడీవో స్వరూప, ఎంపీవో జగదీశ్, ఏఈ జవహర్‌బాబు, బహుజన క్లాస్టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణుడు, హెచ్ఎం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలో..
మున్సిపల్ కార్యాలయంలో జయశంకర్ సార్ చిత్రపటానికి మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వైస్‌చైర్మ న్ తాటి గణేశ్, కమిషనర్ ప్రదీప్‌కుమార్, కౌన్సిలర్లు పటేల్ ప్రవీణ్, కట్టా రవికిషన్‌రెడ్డి, రామాంజనేయులు, రాము, చెన్నవీరయ్య, మునీర్, నరేందర్, నాయకులు లక్ష్మణ్‌యాదవ్, నవకాంత్, చిన్నా పాల్గొన్నారు. అదేవిధంగా డీఈవో కార్యాలయంలో జయశంకర్ చిత్రపటానికి డీఈవో ఉ షారాణి పూలమాల వేసి నివాళులర్పించారు. అ నంతరం కార్యాలయ ఆవరణలో మొక్కలు నా టారు. కార్యక్రమంలో ఏడీ అనసూయ, శంభుప్రసాద్, నర్సింహారెడ్డి, విజయభాస్కర్, అబ్దుల్‌హక్ పాల్గొన్నారు. స్టేడియంలో డీవైఎస్వో శ్రీనివాస్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ వెంకటేశ్వర్‌రెడ్డి, విజయకుమార్, కోచ్‌లు సునీల్, ఖలీల్, అంజద్, పర్వేజ్, సిబ్బంది జయశ్రీ, హరికుమార్ పాల్గొన్నారు.
రాజాపూర్ మండలంలో..
జయశంకర్ సార్ జ యంతిని మండలంలో ఘనంగా నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ సుశీ ల, వైస్‌ఎంపీపీ మహిపాల్‌రెడ్డి, ఎంపీడీవో లక్ష్మీదేవి జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే తాసిల్దార్ కార్యాలయం, ప్రభుత్వ దవాఖాన, పోలీస్స్టేషన్తోపా టు వివిధ కార్యాలయాల్లో జయశంకర్ సార్ జయంతి నిర్వహించారు. కార్యక్రమంలో తాసిల్దార్ శంకర్, ఎస్సై లెనిన్, డాక్టర్ ప్రతాప్చౌహాన్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీశైలంయాదవ్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు బచ్చిరెడ్డి, రమేశ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
హన్వాడ మండలంలో..
మండలంలోని అన్ని గ్రామపంచాయతీల్లో జయశంకర్ సార్ జయంతిని ఘనంగా నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ బాలరాజు, రెవెన్యూ కా ర్యాలయంలో తాసిల్దార్ శ్రీనివాసులు జయశంక ర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించా రు. కార్యక్రమంలో ఎంపీడీవో నటరాజ్, ఎంఈ వో రాజునాయక్ తదితరులు పాల్గొన్నారు.
దేవరకద్ర మండలంలో..
మండలంలోని చౌదర్పల్లి, లక్ష్మిపల్లి, రేకులంపల్లి, కౌకుంట్ల తదితర గ్రామాల్లో జయశంకర్ సార్ జయంతిని ఘనంగా నిర్వహించారు. జయశంకర్ జయంతి సందర్భంగా వెంకటాయపల్లి గ్రంథాలయానికి కొత్త పుస్తకాల కొనుగోలుకు ఎంపీపీ రమాదేవి రూ.12వేలు అందజేశారు.
నవాబ్‌పేట మండలంలో..
మండలకేంద్రంతోపా టు కొల్లూరు, రుద్రారం, కూచూర్, దొడ్డిపల్లి, హన్మసానిపల్లి తదితర గ్రామాల్లో జయశంకర్ సా ర్ జయంతిని ఘనంగా జరుపుకొన్నారు. ఎంపీడీ వో కార్యాలయ ఆవరణలో అధికారులు, ప్రజాప్రతినిధులు జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే బస్టాండ్ చౌరస్తా లో టీఆర్ఎస్ నాయకులు జయశంకర్ జయంతి నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ అనంత య్య, ఎంపీడీవో శ్రీలత, ఎంపీటీసీలు రాధాకృష్ణ, తుల్సీరాంనాయక్, సర్పంచులు లక్ష్మమ్మ, బాలరాజు, కోఆప్షన్ సభ్యుడు తాహెర్, నాయకులు నా గిరెడ్డి, మెండె లక్ష్మయ్య, చందర్‌నాయక్, రఘు, నాగ నర్సింహులు, ఖాజా, భోజయ్యాచారి, పిట్ట ల రవి, నర్సింహులు, ప్రకాశ్, శ్రీశైలం ఉన్నారు.
బాలానగర్ మండలంలో..
మండలకేంద్రంతోపాటు పెద్దాయపల్లి, ఊటకుంటతండా, అప్పాజిపల్లి, బోడగుట్టతండా, వాయిల్‌కుంటతండా, నా మ్యాతండా తదితర గ్రామాల్లో ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాల్లో ఎంపీడీవో కృష్ణారావు, ఎంపీవో శ్రీదేవి, సర్పంచులు శంకర్, గోపీనాయక్, రమేశ్‌నాయక్, పీర్యానాయక్, లలితామంజునాయక్, శారదాబాలునాయక్, ఉపసర్పంచ్ మణి, పంచాయతీ కార్యదర్శులు అనిల్‌కుమార్, నరేశ్, రా మాంజనేయులు, దస్రూనాయక్, వినోద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మిడ్జిల్ మండలంలో..
మండల పరిషత్ కార్యాలయంలో జయశంకర్ సార్ చిత్రపటానికి ఎంపీపీ కాంతమ్మ పూలమాల వేసి నివాళులర్పించారు. అన్నారు. కార్యక్రమంలో వైస్‌ఎంపీపీ తిరుపత మ్మ, ఎంపీటీసీలు గౌస్, రాజారెడ్డి, ఎంపీవో అనురాధ, నాయకులు వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్, బాలస్వామి, రవి పాల్గొన్నారు.