కల్వకుర్తి, ఆగస్టు 12 : నకిలీ డీఏపీ, ఎరు వులను రైతులకు విక్రయించి సొమ్ము చేసు కుంటున్న అసలు సూత్రధారులు ఎక్కడ అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. బంకమన్ను గుళిక లపై భాస్వరం, నత్రజని పూతతో నకిలీ డీఏపీ ని తయారు చేసి పెద్దస్థాయిలో పంపిణీ చేసిన అసలు సూత్రధారిని ఇప్పటి వరకు అదుపులోకి తీసుకోకపోవడంపై విమర్శలు వినిపి స్తున్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లాతో పాటు జోగుళాంబ గద్వాల, వికారాబాద్ జిల్లాలో నకిలీ ఎ రువులు పట్టుబడ్డాయి. పట్టుబ డిన నకిలీ డీఏపీ ఎరువులను వ్యవసాయశాఖ అధికారులు ల్యాబ్‌కు పంపించారు. రైతు లకు విక్రయించిన డీఏపీ నకిలీదేనని ల్యాబ్‌ల నుంచి రిపోర్టులు కూడా వచ్చాయి. నాగర్‌కర్నూల్ జిల్లాలో నకిలీ ఎరువుల బాగోతం వెలుగుచూసి నెలరోజులు కావస్తుంది. ఇప్పటివరకు అసలు సూత్రధారి జాడప త్తాలేదు. నకిలీ ఎరువులు, విత్తనాలు తయారు చేసినా, పంపిణీ చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించిన క్రమంలో..నకిలీ ఎరువుల సూత్రధారిని ఎందుకు పట్టుకోలేకపోతున్నారని రైతు సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. సూత్రధారి బయట ఉంటే నకిలీ ఎరువులు పుట్టుకువస్తాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నాగర్‌కర్నూల్ జిల్లాలో బిజినేపల్లి మండలం మహదేవుని పేట, తాడూర్ మండలం ఆకునెల్లికుదురు, కల్వకుర్తి మండలం లింగసానిపల్లిలో నకిలీ డీఏపీ ఎరువులను వ్యవసాయాధికారులు పట్టుకున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చి కేసులు నమోదు చేయించారు. మహదేవునిపేట నకిలీ ఎరువులు విక్రయాల్లో సంబ ంధం ఉందని 9మందిపై పోలీసులు కేసు నమోదు చేసి ఏడుగురిని రిమాండ్‌కు తరలించారు. నకిలీ ఎరువుల రాకెట్ పెద్దఎత్తున పనిచేయడం వల్లనే చాలా జిల్లాల్లో నకిలీ డీఏపీ ఎరువులను గు ట్టుచప్పుడు కాకుండా విక్రయించారు. చాలా మంది రైతులు నకిలీ డీఏపీ ఎరువులను పంటలకు వేశారు. తీరా తాము వేసింది నకిలీ ఎరువులని తెలుసుకున్న రైతుల గొల్లుమంటున్నారు.
డీఏపీ కొరత ఎక్కువగా ఉండటంతో.. నకిలీ డీఏపీ రాకెట్ రంగంలోకి దిగింది. మట్టిగుళికలపై ఫా స్పరస్, నత్రజని పూత పూసి పెద్ద పెద్ద ఎరువుల కంపెనీ లోగోలతో ఉన్న బస్తాలలో పోసి రైతు లను బురిడీ కొట్టించారు. నేరుగా వాహనాలలో నకిలీ డీఏపీని వేసి గ్రామాల్లోకి తీసుకొచ్చారు. డీఏపీ ఎరువుల కొరత ఉన్న నేపథ్యంలో డైరెక్ట్‌గా ఎరువుల ఫ్యాక్టరీ నుంచి డీఏపీ తీసు కొచ్చామని రైతులకు చెప్పారు. డీఏ పీ ఎరువుల కొరత ఉన్న నేపథ్యంలో రైతులు ముందు వెనుక ఆలోచించకుండా..మళ్లీ లభిస్తాయో లేదోనన్న భయ ంతో అవసరానికి మించి కొ నుగోలు చేశారు. జిల్లాలో చా లా గ్రామాల్లో నకిలీ డీఏపీ బస్తాలను విక్రయించినట్లు తెలుస్తోంది. ఇందులో నకిలీ డీఏపీ గ్రామాల్లో తీసుకొచ్చిన అక్రమార్కులు మరో గేమ్ ఆడారు. గ్రామాల్లో తెల్లచొక్కాలు వేసుకొని రాజకీయాలు చేస్తున్న నాయకులు, వ్యాపారులను మచ్చిక చేసుకున్నారు. బహిరంగ మార్కెట్లో డీఏపీ లభించకపోవడంతో బ్లాక్ మార్కెట్లో ధర చాలా ఎక్కువ ఉందని తమకు మాత్రం డైరెక్ట్‌గా ఫ్యాక్టరీ నుంచి తమకు డీఏపీ వస్తుండటంతో తక్కువ ధరకు మీకు ఇస్తామని, మీరు లాభం చూసుకొని రైతులకు విక్రయి ంచాలని ఆశపెట్టారు. డబ్బులు వస్తాయనే ఆశలో ముందు వెనుక చూసుకోకుండా సదరు నకిలీ డీఏపీని నగదుకు రైతులకు విక్ర యించి సదరు రాకెట్లో చిక్కుకుపోయారు. నకిలీ డీఏపీ విష యంలో చాలా గ్రామాల్లో ఆదే జరిగిందని రైతు సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.
రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్‌పేటలో నకిలీ డీఏపీ తయారు చేసే ఫ్యాక్టరీపై గత నెలలో ఎస్వోటీ పోలీసులు దాడి చేశారు. నకిలీ డీ ఏపీని స్వాధీనం చేసుకొని దాదాపుగా నెలరోజులు కావస్తుంది. నకి లీ డీఏపీ పోలీసులు పట్టుకున్న క్రమంలో ప్రాథమిక సమా చారంతో కేసులు నమోదు చేశారు. పోలీసులు కేసులు న మోదు చేసిన వారిలో ట్రాన్స్పోర్ట్ లారీలు, మధ్యవ ర్తులు మాత్రమే ఉన్నారు. అసలు సూత్రధారులు మాత్రం తప్పించుకు తిరుగుతున్నారు. వీరు తప్పించుకు తిరు గుతున్నారా..? లేదా వారిని ఏదైనా అదృశ్య శక్తి కాపాడుతుందా? అనే అనుమానాలను రైతు సంఘం నాయకులు వ్యక్తం చేస్తున్నారు. ఇం త పెద్ద ఎత్తున నకిలీ డీఏపీని దర్జాగా గ్రామా ల్లోకి పంపించిన సూత్రధారికి పెద్దస్థాయిలో అండ ఉండి ఉంటుందనే రైతులు అను మానిస్తున్నారు. ఇన్ని రోజులు గడుస్తున్నా.. ఎందుకు అసలు సూత్రధారిని పోలీసులు పట్టుకోలేక పో తున్నారని రైతు సంఘాల నాయకులు ప్రశ్ని స్తున్నారు. రైతులకు అవ సరమైనన్ని డీఏపీ రైతులకు లభిస్తే నకిలీ డీఏపీ అనేది ఉండదని, డీఏపీకి తీవ్రమైన కొరత రావడం వల్లనే అక్ర మార్కులు నకిలీ డీఏపీని తయారు చేసి రైతులను మోసం చేశారని రైతు సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి ఎరువులపై ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్లనే ఈ దుస్థితి దాపురించిందని వా రు ఆందోళన వ్యక్తం చేశారు. నకిలీ ఎరువులను సూత్రధారిని అ రెస్ట్ చేసి రైతుల నుంచి తీసుకున్న డబ్బులను వారికి వెనక్కి ఇప్పించాలని డిమాండ్ చేశారు.
రైతులు ఎరువుల బస్తాలను బయట కొనవద్దని, లైసెన్స్ ఉన్న ఫర్టిలైజర్ దుకాణాల వద్ద మాత్రమే కొనుగోలు చేయాలని, కొనుగోలు చేసిన ఎరువులు లేదా విత్తనాలకు సంబంధించిన రసీదులను ఖచ్చితంగా తీసుకోవాలని కల్వకుర్తి ఏవో సురేశ్ చెప్పారు. కల్వకుర్తి మండలం లింగసానిపల్లిలో పట్టుకున్న డీఏపీ నమూనాలను ల్యాబ్‌కు పంపించి రిపోర్టులు తెప్పించుకున్నామని చెప్పారు. బంకమన్ను గుళికలకు నత్రజని, భాస్వరం పూత పూశారని చెప్పారు. రిపోర్టులను పోలీసులకు పంపించామని ఏవో చెప్పారు.