Nagarkurnool | అమ్రాబాద్‌లో దారుణ హత్య.. ఇంట్లోనే మృతదేహం దాచిన వైనం.. భార్య, ఇద్దరు కుమారులే చంపేశారా?
నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్‌లో బురానుద్దీన్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. మృతదేహాన్ని ఇంట్లోని గదిలో కవర్ సంచిలో దాచినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. భార్య, ఇద్దరు కుమారులు పరారీలో ఉండటంతో వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Nagarkurnool | నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండల కేంద్రంలో దారుణ హత్య వెలుగులోకి రావడంతో కలకలం రేగింది. మండల కేంద్రానికి చెందిన బురానుద్దీన్ అనే వ్యక్తి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. కుటుంబ సభ్యులే అతడిని హత్య చేసి, మృతదేహాన్ని సంచిలో పెట్టి ఇంట్లోని ఓ గదిలో దాచినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
స్థానికుల కథనం ప్రకారం.. బురానుద్దీన్ భార్య, ఇద్దరు కుమారులతో కలిసి కొంతకాలంగా ఇంట్లోనే ఉంటున్నాడు. అయితే గత మూడు రోజులుగా ఇంటికి తాళం వేసి ఉండటంతో పాటు కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా అందుబాటులో లేకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. ఇదే సమయంలో ఇంటి నుంచి దుర్వాసన రావడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సోమవారం ఉదయం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సీఐ ఆధ్వర్యంలో డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌లను రంగంలోకి దించి ఆధారాలను సేకరించారు. అనంతరం ఇంట్లోని ఓ గదిలో కవర్ సంచిలో ఉన్న బురానుద్దీన్ మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ హత్యకు కుటుంబ కలహాలే కారణమా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి భార్య, ఇద్దరు కుమారులు పరారీలో ఉన్నట్లు సమాచారం. వారి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest: సీఆర్పీఎఫ్ను కొట్టిన మహిళా యూట్యూబర్.. కేసు నమోదు చేసిన పోలీసులు
High tension | పులివెందులలో హైటెన్షన్..గాల్లో కాల్పులు జరిపిన పోలీసులు
Anant Singh | ‘నితీశ్ కుమార్ కోసం 9 మందిని చంపించా’.. జేడీయూ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
Jammu and Kashmir | జమ్మూ కాశ్మీర్లో అక్రమ చొరబాటుకు యత్నం.. ఇద్దరు ఉగ్రవాదుల కాల్చివేత
Vijayan: మాజీ సీఎం విజయన్ ఇంటికి నోటీసులు అతికించిన ఈడీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

