
మహబూబ్‌నగర్, అక్టోబర్ 1 : వయోవృద్ధులపై ఎవరూ నిర్లక్ష్యం ప్రదర్శించొద్దని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. శుక్రవారం జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. వయోవృద్ధుల స మస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన ట్రి బ్యూనల్ తప్పనిసరిగా మొదటి, మూడో శనివారం సమావేశం కావాలని సూచించా రు. ఎవరైనా వృద్ధులపై అవమానకరంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకునేలా సమావేశంలో తీర్మానం చేయాలన్నారు. అలాగే వృ ద్ధులు చికిత్స నిమిత్తం ఆరోగ్య కేంద్రాలకు వస్తే ప్రాధాన్యత ఇవ్వాలని డీఎంహెచ్‌వోను ఆదేశించారు. ప్రతి బుధవారం ఉదయం 10నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వృద్ధులకు ప్రత్యేక ఓపీని ఏర్పాటు చేయాలని సూ చించారు. అనంతరం వయోవృద్ధులను స న్మానించారు. కార్యక్రమంలో సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షుడు జగపతిరావు, సంక్షే మ శాఖ జిల్లా అధికారి రాజేశ్వరి, వీఐపీ నాగేంద్రస్వామి, ఆర్డీవో పద్మశ్రీ, డీఎంహెచ్‌వో కృష్ణ, నాగభూషణం, సుబ్బయ్య, పాండురంగం, బాలయ్య పాల్గొన్నారు.
క్లీన్ ఇండియా కార్యక్రమం చేపట్టాలి
అక్టోబర్ 1నుంచి 31వ తేదీ వరకు క్లీన్ ఇండియా కార్యక్రమాన్ని అన్ని మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల్లో చేపట్టాలని కలెక్టర్ వెంకట్రావు తెలిపారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కేంద్ర యువజన సర్వీసు లు, క్రీడల శాఖ ఆధ్వర్యంలో నెహ్రూ యు వకేంద్రం ద్వారా నెలరోజులపాటు నిర్వహించనున్న క్లీన్ ఇండియా కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో నెహ్రూ యువకేంద్రం కోఆర్డినేటర్ కోటానాయక్, డీఆర్డీవో యాద య్య, డీపీఆర్వో వెంకటేశ్వర్లు, వలంటీర్లు రఘు, దేవన్న, ఏపీడీ శారద పాల్గొన్నారు.
వైద్యసేవలపై అవగాహన కల్పించాలి
ప్రభుత్వ దవాఖానల్లో అందిస్తున్న వైద్యసేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని పాత పాలమూరు పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దవాఖానకు వస్తున్న రోగుల సంఖ్య, పరీక్షల నిర్వహణ, అందుబాటులో ఉన్న మందుల వివరాలు తెలుసుకున్నారు. అలాగే గర్భిణులకు అందిస్తున్న వైద్యసేవలు, కేసీఆర్ కిట్ మంజూరుపై ఆరా తీశా రు. అనంతరం దూద్ దవాఖాన నిర్మాణా న్ని కలెక్టర్ పరిశీలించారు. నెలరోజుల్లో భవ న నిర్మాణం పూర్తిచేసి అప్పగించాలని టీఎస్ఎంఐడీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు జైపాల్‌రెడ్డిని ఆదేశించారు. కలెక్టర్ వెంట డీఎంహెచ్‌వో కృష్ణ, జిల్లా ఇమ్యూనైజేన్ అధికారి శంకర్, టీఎస్ఎంఐడీసీ ఏఈ శరత్, కౌన్సిలర్ వేదవ్రత్ ఉన్నారు.