
మహబూబ్‌నగర్, ఆగస్టు 10 : ఆరుగాలం కష్టించి పండించిన కూరగాయలను రైతు బజారులో రైతులు స్వేచ్ఛగా, సకల సౌకర్యాల మధ్య విక్రయించేందు కు అధికారులు అవసరమైన సదుపాయాలు కల్పించాలని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆదేశించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని మోడ ల్ రైతుబజార్‌ను అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుబజార్లో తాగునీటి సమస్యతోపాటు ఇతర ఇబ్బందులు లే కుండా చూడాలన్నారు. అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. అధికారులు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ఎప్పటికప్పుడూ రైతులతో మాట్లాడుతూ ఏమైనా ఇబ్బందులు ఉంటే తెలుసుకొని తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. మంత్రి వెంట మున్సిపల్ వైస్ చైర్మన్ గణేశ్, అధికారులు ఉన్నారు.
సుందరంగా మహబూబ్‌నగర్
మహబూబ్‌నగర్‌ను సుందర పట్టణం గా తీర్చిదిద్దుతామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్పష్టం చేశారు. మంగళవారం జి ల్లా కేంద్రంలోని 12వ వార్డు పరిధిలో ఉన్న హనుమాన్‌పురలో జరుగుతున్న సీ సీ రోడ్డు, బండ్లగేరి, క్లాక్టౌన్ చౌరస్తా, అబ్దుల్ ఖాదర్ దర్గాలో జరుగుతున్న ప నులను పరిశీలించారు. దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ కులమతాలకు అతీతంగా మ హబూబ్నగర్ను అన్ని రంగాల్లో అభివృ ద్ధి చేస్తున్నామని తెలిపారు. ప్రధాన కూ డళ్లను సుందరంగా తీర్చిదిద్దుతున్నామ ని చెప్పారు. క్లాక్‌టవర్ చౌరస్తా వద్ద గడియారాలు ఏర్పాటు, బండ్లగేరి చౌరస్తా లో బండ్ల నూమూనా పనులు పూర్తయి తే పట్టణానికి సొబగులు రానున్నాయని పేర్కొన్నారు. గతంలో 15 రోజులకోసా రి తాగునీరు సరఫరా అయ్యేదని, నేడు ఆ సమస్య తీరిందని గుర్తు చేశారు. మిష న్ భగీరథ ద్వారా ప్రతి రోజూ నీటి సరఫరా జరుగుతున్నదని తెలిపారు. పట్టణ అభివృద్ధే తన ముందున్న లక్ష్యమని పే ర్కొన్నారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో జరుగుతు న్న పనులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి త్వరగా పూర్తి చేసేందుకు చర్య లు తీసుకోవాలని ఆదేశించారు. మంత్రి వెంట మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహు లు, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఇంతియాజ్ ఇసాక్, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్‌కుమార్, కౌన్సిలర్లు షేక్ఉమర్, న రేందర్, నాయకులు షఫి, శాంతయ్య, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఉన్నారు.