
అమ్రాబాద్, ఆగస్టు 9 : ‘మా భూములు మాకివ్వండి.. లే దంటే మమ్మల్ని చావనివ్వండి’ అంటూ ఆదివాసీలు సామాజిక మాధ్యమంలో పంపిన సూసైడ్‌నోట్ కలకలం సృష్టించింది. పోలీసుల కథనం ప్రకారం.. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అటవీ ప్రాం తంలోని సర్వే నెంబర్ 1459లో 11 ఎకరాలను ఆదివాసీలు సాగుచేసుకుంటున్నారు. కాగా, ఈ భూములు అటవీశాఖ పరిధి లో ఉన్నాయని, సాగుచేసే వీలులేదని అధికారులు అడ్డుకున్నా రు. దీంతో అమ్రాబాద్ మండలం సార్లపల్లి గ్రామానికి చెందిన చిర్ర రాములు, పెద్దయ్య, మాసయ్య, సైదులు, ఆంజనేయులుతోపాటు మరో ఇద్దరు చెంచులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నామని తిర్మలాపూర్ గ్రామ సమీపంలోని ఏడుపులమ్మ బావి సమీపంలో పురుగుల మందు డబ్బాలు పట్టుకొని సోమవారం వీడియోను చిత్రీకరించారు.మా చావుకు కలెక్టర్‌తోపాటు అటవీశాఖ సీసీఎఫ్ నుంచి కింది స్థాయి వాచర్ వరకు బాధ్యులు అని పేర్కొన్నా రు. ఇండ్లను కూల్చివేస్తున్నారని, అటవీశాఖ సీబీటీ కమిటీలు రద్దు చేసి ఏకపక్షం గా వ్యవహరిస్తున్నారని, అడుగడుగునా అన్యాయం జరుగుతుందని, పరిష్కారం చూపాలని పలు డిమాండ్లతో కూడిన సూసైడ్‌నోట్‌ను ఆదివాసీ చెంచు యువజన సంఘం పేరుతో సామాజిక మాధ్యమాల్లో పో స్ట్ చేశారు. దీని ఆధారంగా అమ్రాబాద్ సీఐ బీసన్న ఆధ్వర్యంలో ఎస్సై పోచయ్య, సుమన్, సురేశ్ తన సిబ్బందితో కలిసి ఉదయం 9 నుంచి ఏడు గంటల పాటు శ్రమించి తిర్మలాపూర్ సమీపంలో ని అడవిలో అదుపులోకి తీసుకున్నారు. ‘మేము రాము.. మ మ్మల్ని చావనివ్వండి.. పోడుభూముల సమస్యలు మా చావుతో పరిష్కారం కావాలి’ అని పట్టుబట్టి కూర్చున్నారు. మీ సమస్యల ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని పోలీసులు నచ్చజెప్పి అమ్రాబాద్ స్టేషన్‌కు తరలించి కౌన్సెలింగ్ ఇచ్చారు.