
బాలానగర్, ఆగస్టు 27 :ఆఖరి మజిలీకి గౌరవం కల్పించేందుకు ప్రభుత్వం గ్రామాల్లో శ్మశానవాటికలు నిర్మిస్తున్న ది. అద్దె బతుకులకు అంతిమ క్షణాల్లో ఆందోళన చెం దాల్సిన అవసరం లేకుండా భరోసానిస్తున్నది. ఒకప్పుడు కు టుంబ సభ్యుల్లో ఎవరైనా చనిపోతే అంత్యక్రియల నిర్వహణ స్థలం కోసం అన్వేషించాల్సి ఉండేది. ప్రభుత్వం ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపింది. ప్రతి గ్రామంలో ఒక శ్మశానవాటికను నిర్మిస్తున్నది. మండలంలో ఏఈ పం చాయతీరాజ్ పరిధిలో 7, ఉపాధి హామీ నిధులతో 30 శ్మ శానవాటికలు నిర్మించాల్సి ఉండగా అందులో భాగంగా 28 పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ఒక బిల్డింగ్తం డా గ్రామ పంచాయతీ పెండింగ్లో ఉంది. 8 తుది దశలో పనులు కొనసాగుతున్నాయి. ఆయా గ్రామాల్లో శ్మశానవా టికలు నిర్మించాలని అధికారులు ప్రతిపాదనలు పంపారు. మండలంలోని 28 శ్మశానవాటికలకు రూ.3కోట్ల50 లక్షలు ఖర్చు చేసి అందుబాటులోకి తెచ్చింది. ఒక్కొక శ్మశానవాటికకు ప్రభుత్వం రూ.12.50 లక్షలు కేటాయించింది.
అద్దె బతుకులకు విముక్తి..
అద్దె ఇండ్లలో ఉంటు న్న వారు మరణించిన సందర్భాల్లో వారి మృతదేహాలను ఇంటి యజమానులు ఇంటికి తేవడాన్ని అ డ్డుకుంటున్నారు. ఈ క్రమ ంలో రోడ్డుపైనే మృతదేహా న్ని ఉంచి గంటల తరబడి ని రీక్షించాల్సిన పరిస్థితులు ఆ కుటుంబాలను కలచివేశాయి. శవాలను రోడ్డుపై ఉంచి ఎడ్చే పరిస్థితి లేకుండా మరణించిన వారిని వెంటనే శ్మశాన వాటికకు తరలించి అక్కడే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసే అవకాశం ప్రభుత్వం కల్పించింది. శ్మశానవాటిక వద్దే శవాన్ని ఉంచి బంధువులు వచ్చిన తర్వాత అంత్యక్రియలు నిర్వహించుకునే సౌకర్యం దొరికిం ది. ఒక విధంగా అద్దె బతుకులకు ముక్తిధామాలతో విముక్తి లభించింది.
సకల వసతులు..
పల్లెల్లో నిర్మిస్తున్న శ్మశానవాటికల ప్రాంగణంలో అన్ని వసతులు కల్పించారు. దింపుడు గల్లెంతోపాటు స్నానాల గదులు, బట్టలు మార్చుకునే గదులు, ఆ ప్రాంతంలో పూల తో ఆహ్లాదకరంగా నిర్మించారు. మలిసంధ్యలో చనిపోయి న వారిని చివరిసారిగా గౌరవించడానికి సకల వసతులతో నిర్మాణాలు పూర్తి చేశారు.
అన్ని వసతులతో..
గ్రామ శివారులో ప్రభుత్వ స్థలాన్ని గుర్తించ గా, ప్రభుత్వం రూ.12.50 లక్షలు మంజూరు చే సింది. నాలుగు నెలల్లోనే అన్ని వసతులతో పనులు పూ ర్తి చేశాం. మొక్కలు నాటాం. అంతిమ సంస్కారాలకు గౌరవం కల్పించేలా ప్రభుత్వం శ్మశానవాటిక నిర్మించింది.
-శంకర్, సర్పంచుల మండల ప్రధాన కార్యదర్శి, బాలానగర్
ఇబ్బందులు పడ్డాం…
గ్రామాల్లో శ్మశానవాటికలు లేక ఇన్ని రోజులు ఇబ్బందులకు పడ్డాం. ఇప్పుడు ప్రభుత్వమే నిధు లు కేటాయించి శ్మశానవాటికలు ఏర్పాటు చేయడం అభినందనీయం. ప్రభుత్వ స్థలాలు లేక కొందరు సోం త భూముల్లో అంత్యక్రియలు నిర్వహించుకునే వా రు. ఆ పరిస్థితులు ఇప్పుడు లేవు.
-శశికాంత్రెడ్డి, పెద్దరేవల్లి
సమన్వయంతో పూర్తి చేశాం…
అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయం తో శ్మశాన వాటికల నిర్మాణాలు పూర్తి చేశాం. మొ దట్లో స్థలాల ఎంపికలో కొంత ఇబ్బందులు పడినప్పటికీ మొత్తంగా సకాలంలో పూర్తి చేశాం. అందరి సహకారంతో అందుబాటులోకి తెచ్చాం. మండలంలో ని 37 గ్రామాల్లో శ్మశాన వాటికలు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటి వరకు మండలం వ్యాప్తంగా 28 పూర్తి చేశాం. మిగిలిన నిర్మాణాలు పూర్తి చేసి త్వరలోనే పూర్తి స్థాయిలో అన్ని సౌకర్యాలతో అందుబాటులోకి తీసుకొస్తాం