నాగర్కర్నూల్, ఆగస్టు 6 తెలంగాణ) : తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపడుతున్నది. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడంతోపాటు 24 గంటల ఉచిత విద్యుత్, వానకాలం, యాసంగి సీజన్లలో రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాల సరఫరాతోపాటు రైతుబంధు అందజేస్తున్నది. ఈ క్రమంలో రైతుబంధులో భాగం గా పాస్ పుస్తకాలు ఉన్న 18 నుంచి 59 ఏండ్లలోపు వయస్సున్న రైతులందరికీ రైతుబీమా వర్తిస్తున్నది. ప్రమాదవశాత్తు మృతి చెం దిన రైతు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎల్ఐసీ ద్వారా బీమా సాయం అందుతున్నది. సీఎం కేసీఆర్ రైతు బీమా పథకాన్ని 2018 ఆగస్టు 14న ప్రారంభించారు. నాటి నుంచి వేలాది మంది రైతులకు రూ.కోట్లల్లో ఆర్థిక సాయం అందజేసింది. ప్రభుత్వమే రైతులకు సంబంధించిన బీమా ప్రీమియం చెల్లిస్తుండడం విశేషం. ఒక్కో రైతుకు ప్రభుత్వమే రూ.2,271.50 ప్రీమియం భరిస్తున్నది. ఇందులో రైతు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఇలా ఇప్పటికే రైతుబంధు పాసు పుస్తకాలు పొం దిన రైతులందరికీ ఎల్ఐసీ ద్వారా బాండ్లను జారీ చేశారు. ఒక్కసారి బీమా బాండు పొందిన రైతులు 59 ఏండ్ల వయస్సు వరకు నిబంధనల ప్రకారం పథకానికి అర్హులు. అయితే ఇప్పటివరకు రై తుబీమాకు దరఖాస్తు చేసుకోని రైతులతోపాటు కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన రైతులకు ప్రభుత్వం ప్రతి ఏడాది అవకాశం కల్పిస్తున్నది.
మృతి చెందిన రైతు కుటుంబంలో నామినీ బ్యాంకు ఖా తాల్లోనే ఈ సొమ్ము జమ అవుతుంది. ఈ బీమా కోసం రైతులు ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడకుండా ప్రభుత్వం నేరు గా రైతు కుటుంబానికి సాయం అందజేస్తుండడం గమనార్హం. ఇంతటి విశిష్టమైన ఈ భీమాలో కొత్తగా పేర్లు నమోదు చేసుకునేందుకు ఈ ఏడాది ప్రభుత్వం మరోసారి గడువు ఇచ్చింది. ఆ ధార్ కార్డులో వయస్సును ప్రామాణికంగానే దరఖాస్తులను ఆ హ్వానిస్తున్నది. 04-08-1962 నుంచి 14-08-2003 మధ్యన జన్మించి పాస్ పుస్తకం ఉన్న రైతులు ఈనెల 11వ తేదీ వరకు మండల వ్యవసాయ కార్యాలయాల్లో స్వయంగా వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. పాస్ పుస్తకం, ఆధార్, నామినీ ఆధార్ జీరాక్స్ కాపీలను ఏఈవోలకు అందజేయాలి. రైతులకు ఎన్నిచోట్ల భూమి ఉ న్నా ఒక్క గ్రామంలో మాత్రమే బీమా వర్తిస్తుంది. ఇలా వచ్చిన దరఖాస్తులను ఏఈవోలు, ఏవోలు వ్యవసాయ శాఖ లాగిన్లో నమోదు చేస్తారు. నాగర్కర్నూల్ జిల్లాలో పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 4,64,478 మంది దరఖాస్తు చేసుకో గా 2,499 మందికి రూ.124.95 కోట్లు బీమాగా సాయం అం దింది. రైతు సంక్షేమం కోసం అమలు చేస్తున్న ఈ పథకం వేలాది మంది రైతుల కుటుంబాల్లో ఆనందాలను నింపుతున్నది.