
సిటీబ్యూరో, ఆగస్టు16(నమస్తే తెలంగాణ): పోలీసు కావాలని కలలు కనే వారికి పరావస్తు క్రియేటివ్ ఫౌండేషన్ అండగా నిలుస్తున్నది. రాష్ట్రంలో 20వేల పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వచ్చే అవకాశాలు ఉండడంతో నిరుద్యోగులు, యువతకు ఉచిత శిక్షణ అందించేందుకు ఈ సంస్థ ముందుకు వచ్చింది. ఇందుకుగానూ ఉచిత శిక్షణ అర్హత కోసం ఆగస్టు19న పరీక్షను నిర్వహిస్తుంది. ఈ అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యే 900 మందికి 5నెలల పాటు పూర్తిగా ఉచిత శిక్షణ ఇస్తామని ఫౌండేషన్ నిర్వాహకుడు గద్దె భాస్కర్ తెలిపారు. ఎంపికయ్యే 900మందిలో 300మందికి రెసిడెన్షియల్ కోచింగ్‌తోపాటు ఉచితంగా హాస్టల్ సదుపాయం, భోజన వసతి ఉంటుందన్నారు. మరో 300 మందికి డే స్కాలర్ కింద, మిగతా 300మందికి ఆన్లైన్లో నిరంతరం శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. అర్హత పరీక్ష మెరిట్ ఆధారంగా 900మంది ఎంపిక ఉంటుందన్నారు. రాష్ట్రంలో హైదరాబాద్‌తో పాటు మొత్తం 12కేంద్రాల్లో ఈ అర్హత పరీక్షను నిర్వస్తున్నట్లు వెల్లడించారు. ఆసక్తి ఉన్న వారు అర్హత పరీక్ష కోసం https://www. facebook.com/ paravasthucreative foundation లింక్‌లో నమోదు చేసుకోవాలన్నారు. అదేవిధంగా ఫౌండేషన్ ప్రతినిధుల నెంబర్లు 7013244247, 6309148246కు సంప్రదించాలని కోరారు. డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన వారు, డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న వారు అర్హత పరీక్షకు అర్హులని పేర్కొన్నారు.