అలంపూర్, డిసెంబర్ 5 : పిల్లా, పాపలు.. ముసలి, ముతక.. ఆడ, మగ.. విద్యార్థి, ఉద్యోగి.. అన్న తేడా లేకుండా ప్రాణాలు సైతం అడ్డుపెట్టి చేసిన ఉద్యమాలు ద్వారా నిరూపితమైంది. కాలుష్య భూతం, పచ్చని పొలాల్లో చిచ్చు రేపే రూ.200 కోట్లతో నిర్మించ తలపెట్టిన ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దని పలు గ్రామాల ప్రజలు ఆత్మస్థర్యంతో సైనికుల్లాగా చేసిన పోరాటాలు ఫలించాయి. విజయం ముమ్మాటికీ కంపెనీ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో ముందుకు సాగిన పరిసర గ్రామాల వాసులదే.. అందుకు సహకరించిన నాయకులకు, మీడియాకు వారు కృతజ్ఞతలు తెలిపారు.
ఇథనాల్ కంపెనీ ఏర్పాటుకు వ్యతిరేకంగా పోరాడిన ఉద్యమాల్లో, నిరసనల్లో, దీక్షల్లో మహిళలు మేము సైతం అంటూ పురుషులతో సమానంగా నిలిచారు. వారికి అండగా నిలబడి పరోక్షంగా, ప్రత్యక్షంగా పోరాటంలో పాల్గొన్నారు. అధికార పార్టీ ఆగడాలకు, పోలీసుల దౌర్జన్యకాండకు.. పోలీసుల అక్రమ అరెస్టులకు ఎందరో బలిపశువులుగా మారారు. నిరసన దాడులతో సంబంధం లేని.. స్థానికంగా లేని.. ఆయా గ్రామాల ఉద్యోగులను, మైనర్లను సైతం పోలీసులు నిర్బంధించారు. వారి కుటు ంబ సభ్యులు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. గ్రామా ల్లో ఖాకీ బూట్ల చప్పుడు ఎప్పుడు వినిపిస్తుందోనన్న భయంతో బిక్కుబిక్కుమంటూ జీవించారు. పండుగలు సైతం జరుపుకోకుండా మొక్కవోని ధైర్యంతో పోరాటాలను ముందుకు తీసుకుపోయారు. ఫ్యాక్టరీ వద్దంటూ చేపట్టిన ఉద్యమం గల్లీ నుంచి ఢిల్లీ దాకా వినపడింది. తమ పక్షాన న్యాయం ఉన్నందుకే మాకు కొంత ఊరట లభించిందని అంటున్నారు.
ఇథనాల్ కంపెనీని వ్యతిరేకిస్తూ వచ్చిన రైతులు, 12 గ్రా మాల ప్రజలకు బీఆర్ఎస్ నాయకులు, స్థానిక ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మె ల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి మద్దతు పలుకుతూ వచ్చారు. ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టవద్దంటూ.. ఇందుకోసం ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా బాధిత ప్రజలకు అండగా పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. ఉద్యమాలకు, పోరాటాలకు, నిరసన దీక్షలకు అండగా నిలబడి మద్దతు పలుకుతూ, వారి పోరాటాలకు ఊతమిచ్చారు. చివరకు ఫ్యాక్టరీ రద్దయ్యే వరకు అండగా ఉంటామని చెప్పి అప్పట్లో ఇచ్చిన హా మీ మేరకు వారు శాయశక్తులా ప్రయత్నం చేశా రు. పోలీసులు అక్రమంగా అరె స్టు చేసిన రైతులకు బెయిల్ ఇప్పించారు. రైతులను మళ్లా అరెస్టు చేయకుండా చర్యలు చేపట్టారు.కాగా ప్రజల పోరాటాలను ఎప్పటికప్పుడు మీడియా ద్వారా ప్రజలు, ప్రభుత్వం ముం దుకు వరుస కథనాల ద్వారా తీసుకొచ్చిన ‘నమస్తే తెలంగాణ’కు బాధితులు కృతజ్ఞతాభివందనాలు తెలిపారు.
ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు వద్దని చేసిన పోరాటాలు ఫలించాయి. ఫ్యాక్టరీ యాజమాన్యం ఇంతటితో కంపెనీ ఏర్పాటును విరమించుకుంటే మంచిదే. అలా కాదని ప్రజా నిర్ణయాలకు వ్యతిరేకంగా నిర్మాణం చేపడితే మరో ఉద్యమానికైనా మేం సిద్ధం. జన జీవనానికి ఆటంకం కల్గించే ఎటువంటి ఫ్యాక్టరీలకైనా మేం వ్యతిరేకం. ప్రభుత్వాలు గ్రామాభివృద్ధికి సహకరించాలి.. కానీ గ్రామాలను వల్లకాడు చేయడానికి సహకరించొద్దు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవద్దు.
– జయరాంరెడ్డి, మాజీ సర్పంచ్, పెద్ద ధన్వాడ గ్రామం
గ్రామాల సరిసరాల్లో రసాయన కాలుష్యం వెదజల్లే ఫ్యాక్టరీలు వద్దు. పచ్చని పొలాలకు చిచ్చు పెట్టి ఫ్యాక్టరీ నిర్మించాలనుకున్న భూముల్లో విత్తనాలు జల్లి పంట లు పండించాలే. పది మంది రైతుల కు పని కల్పించి సమాజానికి ఉపయోగకరంగా మార్చాలి. పచ్చ ని పంటల పొలాల్లో కాలుష్యపు చిచ్చు పెట్టడం మంచిది కాదు.
– కేశన్న, రైతు, పెద్ద ధన్వాడ, రాజోళి మండలం
ప్రజా శ్రేయస్సును పక్కన పెట్టి అధికార బలంతో నిరసన చేసిన రైతులపై అక్రమ కేసులు పెట్టడం చాలా బాధాకరం. ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం ఎక్కడా జరగదు. అర్థబలం, అంగబలం చూసుకుని దౌర్జన్యంగా ఫ్యాక్టరీ కట్టాలనుకోవడం సరికాదు. ప్రజలు వ్యతిరేకిస్తున్న ఫ్యాక్టరీకి ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను ప్రభుత్వం సంపూర్ణంగా రద్దు చేయాలి. ఫ్యాక్టరీతో ప్రజలకు ఉపాధి కలగాలే కానీ, ఉన్న ఉపాధి కోల్పోకూడదు. పాలకులు, ప్రభుత్వం ఆలోచించాలి.
– తిప్పారెడ్డి, రైతు, పెద్ద ధన్వాడ, రాజోళి మండలం
ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో బాధి త 12 గ్రామాల ప్రజల సహకా రంతో చేసిన పోరాటాల వల్ల ఫ్యాక్టరీ నిర్వాహకులు వెనక్కి తగ్గడం కలిగిన తాత్కాలిక ఉప శమనమే. కంపెనీ నిర్మాణానికి ఏడేండ్ల గరిష్ఠ కాల పరిమితి ఉం టుందని తెలిసింది. ఫ్యాక్టరీ నిర్మించు కోవడానికి యాజమాన్యం ఎప్పుడైనా ముందుకు రావచ్చు. పెద్ద ధన్వాడ శివారులో కంపెనీ భూమిలో సిబ్బంది ఉండటానికి గతంలో ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక నిర్మాణాలను (కంటేనర్, గుడిసెలు, టెంట్లు) కంపెనీ యజమాన్యం ఇక్కడ నుంచి తీసుకు వెళ్లారు. కంపెనీ అనుమతులు పర్మినెంట్గా రద్దు చేయాలి.
– నర్సింహ్మ, రైతు, పెద్ద ధన్వాడ, రాజోళి మండలం