భూత్పూర్, నవంబర్ 25 : క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు, మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్‌గౌడ్ కోరారు. స్థానిక కేఎంఆర్ ఫంక్షన్హాల్లో శుక్రవారం ఎంపీపీ కదిరె శేఖర్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బస్వరాజ్‌గౌడ్ మాట్లాడుతూ పేదల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి కా ర్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ముఖ్యం గా రైతుబీమా, రైతుబంధు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, మిషన్ భగీరథ, దళితబంధు, గిరిజనుల రిజర్వేషన్ల పెంపు, సీఎం సహాయనిధి, ఆసరా పింఛన్లు తదితర సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని కోరారు. అలాగే గ్రామా ల్లో చేపట్టిన అభివృద్ధి పనులపై విస్తృత ప్రచారం చేయాలన్నారు. రాష్ట్రం, దేశంలో పార్టీ విజయఢంకా మోగించేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని కోరారు. ఎంపీపీ కదిరె శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి పనిచేసే కార్యకర్తలకే గుర్తింపు ఉంటుందన్నారు. కార్యకర్తలకు ఏ కష్టం రాకుండా అండగా ఉంటామని తెలిపారు. సమావేశం లో సింగిల్‌విండో చైర్మన్ అశోక్‌రెడ్డి, రైతుబంధు సమితి మం డల అధ్యక్షుడు నర్సింహాగౌడ్, మత్స్యసహకార సంఘం జిల్లా ఇన్చార్జి మనెమోని సత్యనారాయణ, కౌన్సిలర్లు శ్రీనివాస్‌రెడ్డి, బాలకోటి, వసంత, ముడా డైరెక్టర్లు చంద్రశేఖర్‌గౌడ్, సాయిలు, నాయకులు సత్తూర్ నారాయణగౌడ్, గోప్లాపూర్ సత్యనారాయణ, మురళీధర్‌గౌడ్, అశోక్‌గౌడ్, రాము, గడ్డం రాములు, సురేశ్‌గౌడ్, బోరింగ్ నర్సింహులు, ప్రేమ్‌కుమార్, యాదయ్య, వెంకటయ్య తదితరులు ఉన్నారు.