కృష్ణ, ఆగస్టు 8 : ఆషాఢ చివరి రోజూ ఆదివారం అమావాస్యను పురస్కరించుకొని మండలంలోని ఆలయాలకు భక్తులు తరలివచ్చారు. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటి స్తూ పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండల కేం ద్రంతోపాటు చేగుంట, గుడెబల్లూర్ తదితర గ్రామాల్లోని ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో గ్రామస్తులు, ప్ర జాప్రతినిధులు పాల్గొన్నారు.
వీరభద్రుడి ఆలయంలో…
పట్టణంలోని వీరభద్రుడి ఆలయంలో ప్ర త్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో నరేశ్ దంపతులచే ప్రత్యేక పూజలు నిర్వహించా రు. నేటి నుంచి శ్రావణ మాసం ప్రారంభమతుందని ఆలయం లో ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయన్నారు.
దామరగిద్ద మండలంలో…
మండలంలోని పలు గ్రామాల ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. క్యాతన్‌పల్లి వీరభద్రేశ్వర ఆలయంలో మద్దూర్ మండలం దమ్‌గాన్‌పూర్ గ్రామానికి చెందిన ప్రేమిలమ్మ విశ్వనాథ్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాల వితరణ, అన్నదా న కార్యక్రమం నిర్వహించారు. మండలానికి సమీపంలో కర్ణాటక రాష్ట్రం యానగుంది మాణిక్యగిరిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ రాష్ర్టాల నుంచి భక్తులు వచ్చి పూజలు చేపట్టారు. ఆలయ పూజారి శివకుమార్, భక్తులు పాల్గొన్నారు.
లోకపల్లి లక్ష్మమ్మ ఆలయంలో…
మండలంలోని ఏక్లాస్పూర్ శివారులో లోకపల్లి లక్ష్మమ్మ అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసం ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. అ మ్మవారి ఆలయానికి ప్రతి మంగళవారం, శుక్రవారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తా రు. శ్రావణ మాసంలో చివరి శుక్రవారం ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఆదివారం అమావాస్యను పురస్కరించుకొని అ మ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహించారు.
కిటకిటలాడిన బద్వేశ్వరాలయం…
జిల్లా సరిహద్దులోని బద్వేశ్వరాలయంలో అమావాస్య, శ్రావ ణ మాసం ప్రారంభం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో త రలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి రుద్రాభిషేకం, బి ల్వార్చన, మహామంగళహారతి, నైవేద్యం, తీర్థప్రసాదాల వితర ణ చేపట్టారు. భక్తులు స్వామివారిని దర్శించుకొన్నారు.
ఆలయంలో భక్తుల సందడి
మండలంలోని ఏక్లాస్‌పూర్‌లో వెలిసిన తిమ్మప్ప (బాలాజీ)స్వామి ఆలయంలో అమావాస్యను పురస్కరించుకొని భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకొన్నారు. ఆలయంలో ప్రత్యే క పూజలు నిర్వహించారు. తెల్లవారు జామున నుంచే దర్శనం కోసం బారులు దీరారు. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఆలయంలో సందడి ఏర్పడింది. అనంతరం తీర్థప్రసాదాల వితరణ చేపట్టారు.
అయ్యప్ప ఆలయంలో…
జిల్లా కేంద్రంలోని యాద్గీర్ రోడ్లో గల అయ్యప్పస్వామి ఆలయంలో అమావాస్యను పురస్కరించుకొని ప్రత్యేక పూజలు ని ర్వహించారు. డాక్టర్ విక్రమ్‌సింగ్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం కార్యక్రమం చేపట్టారు. అంతకు ముందు స్వామివారి మూల విగ్రహానికి అభిషేకం, ప్రత్యేక పూజలు, నైవేద్యం, మహా మంగళహారతి నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అధ్యక్షు డు మనోహార్ప్రసాద్గౌడ్, బాలరాజు, శంకర్, మహేశ్, శ్రీధర్, రాజు, మిర్చి వెంకటయ్య పాల్గొన్నారు.
ఆలయంలో అన్నదానం
జిల్లా కేంద్రం నుంచి దామరగిద్ద వెళ్లే మార్గంలోని మెట్టుగడ్డ అభయాంజనేయస్వామి ఆలయంలో అమావాస్యను పురస్కరించుకొని భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. పట్టణానికి చెందిన దేవనూర్ మంజుల బుగ్గయ్యగౌడ్ అన్నదాన కార్యక్రమానికి విరాళం ఇవ్వగా, గజ్జలి శ్రీనివాస్ అరటి పండ్లకు, సంతోష్ ఘనతే స్వీట్లకు విరాళం అం దించారు. కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామి వారిని దర్శించుకొని, అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అన్నదానం, పండ్లు, స్వీట్ల దాతలను ఆలయ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు.
నందవరం చౌడేశ్వరీ అమ్మవారి వేడుకలు
జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణవాడలో గల చౌడేశ్వరీదేవి ఆలయంలో నందవరం చౌడేశ్వరి అమ్మవారి జన్మదిన వేడుకలను కనుల పండువగా నిర్వహించారు. ఆషాఢంలో అమావాస్య రోజున ప్రతి ఏడాది అమ్మవారి జన్మదిన వేడుకలను నిర్వహి స్తుంటారు. ఈ క్రమంలో ఈ ఏడాది అమ్మవారి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ఆలయ ఆవరణలో అమ్మవారికి డోలారోహణం చేసి భక్తి గీతాలు ఆలపించారు. ఆ తర్వాత అమ్మవారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమానికి భక్తులు హాజరయ్యారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.
బాపునగర్ చౌడేశ్వరి ఆలయంలో…
జిల్లా కేంద్రంలోని బాపునగర్ చౌడేశ్వరి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఉదయం అభిషేకం, యజ్ఞం, డోలారోహణం నిర్వహించిన తర్వాత అన్నదాన కార్యక్రమం చేపట్టారు. అనంతరం అన్నదాతలను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అనసూయ, ఆలయ కమిటీ అధ్యక్షుడు బి.రమేశ్, ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, సభ్యులు పాల్గొన్నారు.