మరికల్, ఆగస్టు 7 : బిడ్డలకు సంపూర్ణ ఆరోగ్యం అందించడం తల్లిపాలతో సాధ్యం అవుతుందని ఐసీడీఎస్ సీడీపీవో సరోజిని అన్నారు. శనివారం మండలకేంద్రంలోని అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవ కార్యక్రమం నిర్వహించారు. గర్భిణులు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యతపై పలు సూచనలు చేశా రు. ఈ సందర్భంంగా ఆమె మాట్లాడుతూ అంగన్వా డీ కేంద్రాల్లో అందజేస్తున్న పౌష్టికాహారాన్ని గర్భిణు లు, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని సూ చించారు. ప్రతి తల్లీ బిడ్డకు పాలు పట్టాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ గోవర్ధ్దన్, ఎంపీటీసీ గోపాల్, ఉపసర్పంచ్ శివకుమార్, సూపర్వైజర్ అమ్మక్క, వార్డు సభ్యులు, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు, ఆ యాలు తదితరులు పాల్గొన్నారు.
తల్లిపాల విశిష్టతపై అవగాహన
తల్లిపాల వా రోత్సవాలను పురస్కరించుకొని మండలంలోని గుడెబల్లూర్, ము డుమాల, హిందుపూర్, మురహరిదొడ్డి, తంగిడిగి తదితర గ్రామాల్లో ని అంగన్వాడీ కేంద్రాల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ అమ్మక్క మాట్లాడుతూ తల్లిపాలలో పు ష్కలమైన పోషకాలు ఉంటాయని తెలిపారు. పిల్లలకు తల్లిపాలు తాగించాలని, డబ్బాపాలతో పిల్లలు అనారోగ్యం పాలవుతారన్నారు. కార్యక్రమంలో అంగన్వా డీ టీచర్లు, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, గర్భిణులు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు.
రోగనిరోధక శక్తి అధికం
తల్లిపాలలో రోగనిరోధక శక్తి అధికంగా ఉంటుందని సర్పంచ్ మాణిక్యమ్మ, ఐసీడీఎస్ సూపర్వైజర్ సరోజ, ఏఎన్ఎం గోవిందమ్మ అ న్నారు. మండలంలోని మల్లేపల్లి, పగిడిమర్రి, అవుసలోనిపల్లి తదితర గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో తల్లిపాల వారోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలకు తల్లిపాల విశిష్టతను వివరించారు. చిన్నారుల ఎదుగుదలకు తల్లిపాలు ఎంతో దోహదం చేస్తాయన్నా రు. పుట్టిన ప్రతి బిడ్డకూ అరగంట లోపు ముర్రుపాలు పట్టించాలని సూచించారు. కార్యక్రమంలో అంగన్వా డీ టీచర్లు, ఉపాధ్యాయినీలు పాల్గొన్నారు.
పిల్లల ఎదుగుదలకు పోషకాలు అవసరం
పిల్లలు ఆరోగ్యవంతం గా ఎదుగాలంటే సరైన పోషకాలు అవసరమని కౌన్సిలర్ అనూష, ఏఎన్ఎం సరస్వతి అన్నారు. తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా పట్టణంలోని 1వ వార్డు అం గన్వాడీ కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో గర్భిణులు, బాలింతలను ఉద్దేశించి వారు మాట్లాడారు. త ల్లిపాల ఆవశ్యకత, చిన్నారులకు ముర్రుపాలు అందించడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ప్రతిరోజూ గర్భిణులు, బాలింతలు ఆకుకూరలు, కూరగాయలు, పప్పు దినుసులు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్క ర్లు, గర్భిణులు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు.