నాగర్కర్నూల్, ఆగస్టు 27 (నమస్తే తెలంగా ణ) : టీఆర్ఎస్ పార్టీని గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సంస్థాగతంగా బలోపేతం చేసేందు కు సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించా రు. కార్యాచరణకు ఆదేశించారు. దీంతో గ్రామ, మండల, జిల్లా కార్యవర్గాలు ఏర్పాటు కానున్నా యి. ఇప్పటికే పార్టీలో సభ్యత్వాల సేకరణ దాదాపుగా పూర్తయింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం లో దాదాపుగా 70 వేల వరకు సభ్యత్వాలు నమోదయ్యాయి. మహిళలు సైతం స్వచ్ఛందంగా క్రి యాశీల సభ్యత్వాలు తీసుకున్నారు. ఇతర పార్టీల సభ్యత్వాలకు కనీస ఆదరణ రాని పరిస్థితులు ఏ ర్పడ్డాయి. గ్రామాల నుంచి వందలాది మంది స భ్యత్వాలకు ముందుకొచ్చారు. టీఆర్ఎస్ నాయకులే ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా, మండల, ము న్సిపల్, మార్కెట్ కమిటీ చైర్మన్లతోపాటు రాష్ట్ర, మండల, గ్రామస్థాయిలో వేలాది మంది ప్రజాప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారు. టీఆర్ఎస్ ప్ర భుత్వం అన్ని వర్గాల వారికి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పెద్ద ఎత్తున అమలు చేస్తున్నది. ప్రతిపక్షాలు ప్రభుత్వ విధానాలను తప్పుదోవ ప ట్టించేలా దుష్ప్రచారం చేస్తున్నాయి. దీన్ని తిప్పి కొట్టేందుకు పార్టీ అధినేత కేసీఆర్ టీఆర్ఎస్ను గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు ఆదేశించారు. గతంలో ని యమితులైన కమిటీల స్థానంలో పూర్తిగా కొ త్త కార్యవర్గాలను ఎంపిక చేయనున్నా రు. పెండింగ్లో ఉ న్న సభ్యత్వాలను ఈ నెలాఖరులోగా పూర్తి చే యనున్నారు. ఇలా వచ్చే సెప్టెంబర్లో పార్టీ కమిటీలు నియమించనున్నారు.
ప్రతి కమిటీలో 20 నుంచి 25 మంది సభ్యులు ఉండనున్నారు. సెప్టెంబర్ తొలి వారంలో గ్రామ, పట్టణ కమిటీ లు, రెండో వారంలో మండల కమిటీలు, మూడో వారంలో జిల్లా కమిటీలు ఎంపిక కానున్నాయి. సెప్టెంబర్ 2న గ్రామ, వార్డు కమిటీల నిర్మాణం కానున్నది. ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోనే కమిటీల ఎంపిక ఉండనున్న ది. రాష్ట్రంలో కొత్తగా జిల్లాలు ఏర్పడినప్పటి నుంచి జిల్లా స్థాయి కమిటీలు ఏ ర్పాటు కాలేదు. ఈసారి తొలిసారిగా జిల్లా కమిటీల ఎంపిక జరుగుతుండడం గమనార్హం. పార్టీ జిల్లా అధ్యక్షుడిని రాష్ట్ర అధినేతలు నియమిస్తారు. జిల్లా అధ్యక్షులు జిల్లా కా ర్యవర్గాలను ఎంపిక చే సుకుంటారు. ఆ తర్వాత రాష్ట్ర కమిటీ ఎంపిక. ఇందుకుగానూ త్వరలో జిల్లాలకు పార్టీ ఇన్చార్జిలను నియమించనున్నారు. సెప్టెంబర్ నెలంతా పార్టీలో సంస్థాగత ఎన్నికల సందడి నెలకొననున్నది. దసరాలోగా ఆయా జిల్లాల్లో మినీ తెలంగా ణ భవన్ ప్రారంభోత్సవం చేపట్టనున్నారు. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పార్టీ జి ల్లా కార్యాలయం ప్రారంభోత్సవం జరగనున్నది. ఇప్పటికే నిర్మాణ పనులు పూర్తయ్యాయి. పార్టీని బలోపేతం చేసి ప్రభుత్వ సం క్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టి ప్రజలను టీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధి లో భాగం చేయనున్నారు.