అమరచింత, ఆగస్టు 16 : యూరియా కోసం రైతులు నరకయాతన పడుతున్నారు. పీఏసీసీఎస్ కేంద్రాలు, ఆగ్రో సేవా కేంద్రాల వద్ద పొద్దస్తమానం పడిగాపులు తప్పడం లేదు. అమరచింత పట్టణంలోని ఆగ్రో సేవా కేంద్రంతోపాటు ఆత్మకూరు పీఏసీసీఎస్కు శుక్రవారం సాయంత్రం ఒక్కో లారీ యూరియా లోడ్ వచ్చింది. హమాలీలు అన్లోడ్ చేస్తుండగానే.. విషయం తెలుసుకొన్న రైతులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకొని యూరియా అందించాలని డీ లర్కు విజ్ఞప్తి చేశారు.
దీంతో అమరచింత రైతు ఆగ్రో సే వా కేంద్రం డీలర్ అధికారులు అందుబాటులో లేరని, శ నివారం ఉదయం వ్యవసాయ అధికారులు వచ్చి రిజిస్టర్ చేశాకే అందిస్తామని చెప్పారు. దీంతో వారు అక్కడి నుం చి వెనుతిరిగారు. మరుసటి రోజు తెల్లవారుజామున 4 గంటల నుంచి కేంద్రం వద్దకు చేరుకున్న కర్షకులు క్యూ కట్టారు. ఉదయం అక్కడికి వచ్చిన డీలర్ రైతు ఆధార్, పట్టాబుక్ జిరాక్స్లను తీసుకుని ఒక్కొక్కరికి రెండేసి బ స్తాల చొప్పున అందజేశాడు. అయితే ప్రైవేటు డీలర్లు మా త్రం యూరియా బస్తాలను అధిక ధరలకు విక్రయిస్తున్నారని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. ప్రతి దుకాణం లో ఎరువులు అందించేందుకు కృషి చేయాలని కోరారు.