మహబూబ్‌నగర్ టౌన్, మే 31 : నేటి బాల లే రేపటి నవభారత నిర్మాతలని భావించిన తె లంగాణ సర్కార్.. విద్యా వ్యవస్థను పటిష్టం చే స్తున్నది. బడ్జెట్లో నిధులు కేటాయిస్తూ పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నది. సకల సౌకర్యాలతో విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తున్న ది. ఇందులో భాగంగా బాలికల డ్రాపౌట్స్‌ను తగ్గించడమే ధ్యేయంగా ఏర్పాటైన కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలను సకల హంగులతో తీర్చిదిద్దుతున్నది. మారుమూల తండా లు, గ్రామీణ ప్రాంతాల్లో బడి మానేసిన విద్యార్థినులకు చక్కటి విద్యనందిస్తూ ప్రోత్సహిస్తున్న ది. 6 నుంచి 10వ తరగతి వరకు ఒక్కో విద్యార్థినిపై ఏడాదికి రూ.1.25 లక్షలు ఖర్చు చేస్తున్నది.
కాగా, పదో తరగతి పూర్తయిన విద్యార్థినుల తల్లిదండ్రులు కొందరు కళాశాల కోసం ప ట్టణాలకు పంపించలేక చదువు మాన్పించడంతోపాటు బాల్యవివాహాలు చేస్తున్నారు. ఇది గమనించిన రాష్ట్ర సర్కార్ కేజీబీవీలను ఇంటర్ స్థాయికి అప్‌గ్రేడ్ చేసింది. దీంతో 6వ తరగతి లో అడ్మీషన్ పొందిన విద్యార్థినులు అదే విద్యాలయంలో ఇంటర్ విద్యను కూడా పూర్తి చేయనున్నారు. ఇప్పటికే జిల్లాలో ఏడు పాఠశాలలు కళాశాలలుగా అప్‌గ్రేడ్ అయ్యాయి. ఇదిలా ఉం డగా, ఈ విద్యా సంవత్సరం నుంచి అన్ని కేజీబీవీల్లో కూడా ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చే సేందుకు కసరత్తు చేస్తున్నది. మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం 14 కేజీబీవీలు ఉన్నాయి.
వీటి లో అడ్డాకుల, బాలానగర్, డోకూర్, మహ్మదాబాద్, జడ్చర్ల, ఏనుగొండ, నవాబ్‌పేట కేజీబీవీలను ఇంటర్ వరకు అప్‌గ్రేడ్ చేశారు. వాటితో పాటు మిగిలిన ఏడు కేజీబీవీల్లో కూడా ఈ విద్యా సంవత్సరం నుంచి ఆంగ్లమాధ్యమాన్ని అమలు చేయనున్నారు. ఇందుకోసం కేజీబీవీ ఉపాధ్యాయినులందరికీ జూన్ 1 నుం చి 5వ తేదీ వరకు జిల్లా కేంద్రంలో శిక్షణ ఇవ్వనున్నారు. అజీం ప్రేమ్‌జీ వర్సిటీ రూపొందించిన ఇంగ్లిష్ లాంగ్వేజ్ ఎన్రిచ్మెంట్ కోర్సు పూర్తి చేయించి, ఆంగ్ల బోధనకు వీలుగా ఉపాధ్యాయులను సన్నద్ధం చేయనున్నారు.
ఉపాధ్యాయినులకు ఆంగ్ల బోధనపై ప్రత్యేక శిక్షణ..
కేజీబీవీలో ఆంగ్ల బోధనకు వీలుగా ఉపాధ్యాయినులను సన్నద్ధం చేస్తున్నాం. ఆంగ్ల బోధనపై కొందరికి ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. మిగిలిన ఉపాధ్యాయినులకు శిక్షణ ఇస్తాం. 6 నుంచి 10వ తరగతి వరకు కేజీబీవీల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి ఆంగ్లమాధ్యమం అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది.