
జడ్చర్ల/టౌన్, ఆగస్టు 24 : శ్రావణ మంగళవారం సందర్భంగా పలు గ్రామా ల్లో మైసమ్మ, పోచమ్మ బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. జడ్చర్ల మండలంలోని బూరెడ్డిపల్లి, గొల్లపల్లి, లింగంపేట, ఈర్లపల్లి, కోడ్గల్, పోలేపల్లి, మాచారం తదితర గ్రామాలలో పోచమ్మదేవతకు మహిళలు బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. బూరెడ్డిపల్లిలో నిర్వహించిన పోచమ్మ బోనాల పండుగలో జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా జడ్చర్ల మున్సిపాలిటీలో పోచమ్మ బోనాల పండుగను ఘనంగా జరుపుకొన్నారు. బాదేపల్లి పాతబజార్‌లోని పోచమ్మ ఆలయంలో భక్తులు బోనం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. నిమ్మబావిగడ్డ, పాతబజార్ పోచమ్మ ఆలయాల్లో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, సంగీత, నాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్, జెడ్పీ వైస్‌చైర్మన్ యాద య్య, డీసీసీబీ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మితోపాటు కౌన్సిలర్లు ప్రత్యేక పూజలు చేశారు. బోనాల పం డుగను పురస్కరించుకుని చైతన్యనగర్కాలనీ, శ్రీరాంనగర్‌కాలనీ, పాతబజార్, హరిజనవాడ, జవహర్‌నగర్, త్రిశూల్‌నగర్, నల్లకుంట ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు బోనాలతో ఊరేగింపుగా తరలివచ్చారు. పోతురాజు వేషధారణలో నృత్యా లు, డప్పుమోతల మధ్య ఉత్సాహభరితంగా బోనాల ఊరేగింపు కొనసాగింది.
బాలానగర్ మండలంలో..
మండలంలోని గౌతాపూర్‌లో మైసమ్మ బోనాల పండుగను కనులపండువగా జరుపుకొన్నారు. మహిళలు బోనాలతో ఊరేగింపుగా మైసమ్మ ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి, సర్పంచ్ రమేశ్, ఉపసర్పంచ్ కవిత, కోఆప్షన్ సభ్యుడు కల్లెం శ్రీనివాసులు, వార్డుసభ్యులు సుధాకర్, భాస్కర్, శ్రీనివాస్‌రెడ్డి, బాలరాజు పాల్గొన్నారు.
భూత్పూర్ మండలంలో..
మండలంలోని కొత్తమొల్గర, పోతులమడుగు, కరివెన, భ ట్టుపల్లి, కప్పెట, పాతమొల్గర తదితర గ్రా మాల్లో పోచమ్మ బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కార్యక్రమంలో ము న్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
దేవరకద్ర మండలంలో..
మండలంలోని కౌకుంట్ల, రేకులంపల్లి, డోకూర్, ఇస్రంపల్లి గ్రామాల్లో పోచమ్మ బోనాల పండుగను ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారికి సుగంధ జలాలతో అభిషేకాలు తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు బోనాలతో అమ్మవారి ఆలయానికి ఊరేగింపుగా చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో సర్పంచులు స్వప్నకిషన్రావు, శివరాజు, స్వామి, రామకృష్ణారెడ్డి, ఎంపీటీసీ కిష్టన్న, ఉపసర్పంచ్ నర్సింహులు, నర్సింహ పాల్గొన్నారు.
మూసాపేట మండలంలో..
మండలంలో ని చక్రాపూర్, జానంపేట తదితర గ్రామా ల్లో బోనాల పండుగను వైభవంగా నిర్వహించారు. మహిళలు బోనాలతో పోచమ్మ ఆలయానికి వెళ్లి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
రాజాపూర్ మండలంలో..
మండలకేంద్రంతోపాటు కుచ్చర్కల్, నందిగామా గ్రా మాల్లో పోచమ్మ బోనాల పండుగను ఘనం గా జరుపుకొన్నారు. బోనాల ఊరేగింపులో పోతురాజుల ఆటలు, శివసత్తుల నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జనంపల్లి అనిరుద్‌రెడ్డి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు బచ్చిరెడ్డి, రంగారెడ్డిగూడ సర్పంచ్ శశికళారెడ్డి, రైతుబంధు సమి తి మండల అధ్యక్షుడు నర్సింహులు, శ్రీనివాస్, కృష్ణయ్యగౌడ్, చంద్రకాంత్, సత్య య్య, అచ్చయ్య పాల్గొన్నారు.