
మహబూబ్‌నగర్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ ప్ర తినిధి) : తాగు, సాగు నీటి రాకతో రాష్ట్రంలో అన్నదాత కు భరోసా ఏర్పడిందని, రైతులు గతంలో ఎప్పుడూ లేనంత సంతోషంగా ఉన్నారని వ్యవసాయ శా ఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపా రు. మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలం పెద్ద మునగాలచేడ్ గ్రా మంలో నల్లమద్ది రాజేశ్వర్‌రెడ్డి జ్ఞాపకార్థం జెడ్పీటీసీ రాజశేఖర్‌రెడ్డి సొంత నిధులతో నిర్మించిన పాఠశాల భ వనం ప్రారంభోత్స వం, సబ్‌స్టేషన్, డబుల్ బె డ్రూం ఇండ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు. ఒకప్పుడు కండ్లముందే కృష్ణానది నీళ్లు ఆంధ్ర వైపు వెళ్లినా చూస్తూ ఉండాల్సిన దుస్థితి ఉండేదన్నారు. బోర్లు, బావుల్లో చుక్క నీళ్లు లేక రైతులు ఆగమయ్యారన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతలతో రేయింబవళ్లు కష్టపడి పంట పొలాల్లోకి మళ్లించామన్నారు. టీఆర్ఎస్ సర్కార్ ఏర్పడిన తరువాత రూ. 107 కోట్లతో చేపట్టిన పనులతో నేడు 25 వేల ఎకరాలకు సాగునీరందుతుందని, దేవరకద్ర, వనపర్తి నియోజకవర్గాల రైతుల కష్టాలు తీరాయన్నారు. జీవాలు తాగేందుకు కూడా నీళ్లు లేని దశ నుంచి.. ఇప్పుడు ఎక్కడ చూసినా పచ్చదనం పరుచుకునే విధంగా మార్పు వచ్చిందన్నారు. హరితహారంతో భారీగా పచ్చదనం పెరిగి కుండపోత వర్షా లు కురుస్తున్నాయన్నారు. వాగుల్లో నీటి ప్రవాహం పెరిగి సరళాసాగర్ ప్రాజెక్టుకు గండి పడేంతగా నీళ్లు వచ్చాయని తెలిపారు. ఒకప్పుడు కరువుతో వలసలు వెళ్లిన గ్రామాలు మళ్లీ పునరుజ్జీవం పొందాయన్నారు. సంతోషంగా, ధై ర్యంగా వ్యవసాయం చేసుకుంటామనే భరోసా రైతుల్లో వచ్చిందన్నారు. దేశంలో ఎక్కడా చేపట్టని పథకాలు తెలంగాణలో ఉన్నాయన్నారు. అందుకే కర్ణాటకలోని రాయిచూరు ఎమ్మెల్యే, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చెందిన శివరాజ్ పాటిల్ తమ జిల్లాను తెలంగాణలో కలపాలని బహిరంగ సమావేశంలో పేర్కొన్నారని గుర్తు చేశా రు. దేశంలో కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో తెలంగాణ కంటే ఒక్క పథకం గొప్పగా అమలు చేస్తున్నట్లు నిరూపించాలన్నారు. సీఎం కేసీఆర్‌పై అవాకులు చెవాకులు మా ట్లాడితే గొప్ప అని భావిస్తున్నారని ప్రతిపక్షాల తీరును ఎ ద్దేవా చేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సు ధాకర్‌రెడ్డి, ఎంపీపీలు నాగర్జునరెడ్డి, మేఘారెడ్డి, సర్పంచ్ విజయలక్ష్మి, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
చెల్లని పైసలకు గీతలెక్కువ..
కాంగ్రెస్ నాయకులకు ప్రస్తుతం ఉపాధి కరువైంది. ఎలాగైనా ఉద్యోగం సాధించాలని తపన పడుతున్నారు. అందుకే జంగ్ సైరన్ అంటూ ఏదో కార్యక్రమాన్ని పెట్టుకొని పాలమూరు వస్తున్నారు. చెల్లని పైసలకు గీతలెక్కువ. కాంగ్రెసోళ్లకు మాటలెక్కువ. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని ప్రజలు గమనిస్తున్నారు. ఎన్ని జంగ్‌సైరన్‌లు పెట్టినా ప్రజలు అటు వైపు కన్నెత్తి కూడా చూడరు.
సీఎం కేసీఆర్‌ది ముందుచూపు..
తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏమేం చేయాలని సీఎం కేసీఆర్ ఎంతో ముందుతో ఆలోచించారు. కేసీఆర్ వంటి వ్యక్తి మనకు సీఎంగా ఉండటం గొప్ప అదృష్టం. కర్ణాటకలోని బీజేపీ ఎమ్మెల్యే రాయిచూర్ను తెలంగాణలో కలపాలని అంటున్నారంటే ఇక్కడి పథకాలు, సీఎం కేసీఆర్ దార్శనికత అర్థం చేసుకోవాలి. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడా లేవు. అందుకే అందరి దృష్టి మన రాష్ట్రంపై పడుతున్నది. రాయిచూరులో కరోనా కష్టకాలంలో రైతులతో రూ.1300 నుంచి రూ.1400 వరకు ధాన్యం కొంటే.. తెలంగాణలో మాత్రం రైతుల వద్దకే వెళ్లి ప్రభుత్వం రూ.1888కి ధాన్యం కొన్నది. అడ్డాకుల నుంచి ఇస్రంపల్లి వరకు బీటీ రోడ్డు నిర్మిస్తాం. వాగుపై చెక్ డ్యాం కమ్ బ్రిడ్జి ఏర్పాటు చేస్తాం.