నాగర్కర్నూల్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ) : చిన్నారులు ఆరోగ్యంగా ఎదగాలంటే సంపూర్ణ ఆహారం అందాలి. అయితే, తల్లులకు పౌష్టికాహారంపై సరైన అవగాహన ఉండడం లేదు. ఫలితంగా బిడ్డలు ఆరోగ్యంగా పుట్టకపోవడంతోపాటు సరిగ్గా ఎదగడం లేదు. దీంతో చాలా మంది పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు. దీనిని నివారించేందుకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ చర్యలు చేపట్టింది. 2018 నుంచి ప్రతి ఏడాది సెప్టెంబర్లో పోషక అభియాన్ మాసోత్సవాన్ని నిర్వహిస్తున్నది. ఈనెల 30వ తేదీ వరకు ప్రతి వారం ఓ అంశంపై కార్యాచరణ చేపట్టనున్నారు. గర్భిణులు, బాలింతలకు పోషకాహారంపై అవగాహన కల్పించడమే మాసోత్సవం ఉద్దేశం. ప్ర స్తుతం అంగన్వాడీ కేంద్రాల్లో ఆరోగ్యలక్ష్మి పథకంలో భాగంగా 2015 జనవరి 1 నుంచి ఒక పూట సంపూర్ణ భోజనంతో పాటు గుడ్లు అందజేస్తున్నారు. కాగా శిశువులకు ఆరు నెలల తర్వాత తల్లిపాలతోపాటు అనుబంధ ఆహారం అందించాల్సి ఉంటుంది. పోషక మాసోత్సవ్లో భాగంగా ముందుగా చిన్నారుల వయస్సుకు తగిన ఎత్తు, బరువులు గుర్తిస్తారు. అలాగే ఆ పిల్లల ఇంటికి ప్రత్యేకంగా అదనపు ఆహారం అందిస్తారు. నెల రోజుల తర్వాత మళ్లీ పిల్లల ఎత్తు, బరువు సేకరిస్తారు. ఈ వివరాలన్నింటినీ అంగన్వాడీ కార్యకర్తలు ఆకుపచ్చ, పసుపు పచ్చ, ఎర్ర రంగు చార్టుల్లో పొందుపర్చి తల్లులకు ఇస్తారు. దీన్ని బట్టి ఆరేండ్లలోపు చిన్నారులకు ఏయే మోతాదులో పోషకాహారం అందించాలో అవగాహన కల్పిస్తారు. పోషణలో పం, కౌమార బాలికల్లో రక్తహీనత, తక్కువ బ రువుతో పుట్టే పిల్లల సంఖ్య మహి ళలు, గర్భిణులకు పౌష్టికాహారం అందించడం మాసోత్సవ లక్ష్యం.
పౌష్టికాహారం ఇలా..
శిశువుకు పుట్టిన గంటలోగా ముర్రుపాలు తా గించాలి. ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలే ప ట్టాలి. తాగునీరు, ఇతర ద్రావణాలు ఇవ్వకూడ దు. ఆరు నుంచి 9 నెలలలోపు ఇంట్లో వండిన అన్నం, పప్పు, కూర, గుడ్డు అయితే మెత్తగా చే సి, పండు అయితే గుజ్జుగా చేసి 250 మి.లీ. గి న్నెలో సగం నుంచి మూడో వంతు ఉండేలా చూసుకొని రోజుకు 2 నుంచి 3 సార్లు తినిపించాలి. 9 నుంచి 12 నెలల వయస్సున్న పిల్లలకు రోజుకు 3 సార్లు తినిపించాలి. ఉడికించిన బం గాళదుంపలు, క్యారెట్ మెత్తగా చేసి తినిపించొ చ్చు. చిరుతిండి (ఇంట్లో తయారు చేసిన స్నా క్స్) ఒకసారి పెట్టాలి. తల్లిపాలు తప్పనిసరిగా ఇవ్వాలి. మెత్తగా చేసిన అరటి పండు, బొప్పాయిపండ్లను తినిపించాలి. పప్పు, పులగంలో నానబెట్టిన రొట్టెలను కూడా తినిపించొచ్చు.
మాసోత్సవం కార్యక్రమాలు..
మొదటి వారం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు చేతులు శుభ్రం చేసుకోవడం, మంచి ఆహారం వంటి అంశాలపై చిత్రలేఖన పోటీలు నిర్వహిస్తున్నారు. సమతుల్య ఆహారం తీసుకోవడం, పాఠశాల ఆవరణలో కూరగాయల మొక్కలు పెంచడంపై కూడా అవగాహన కల్పిస్తారు.
రెండో వారంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించి తల్లిపాల ప్రాముఖ్యత, ప్రయోజనాలను వివరిస్తారు. సీసా పాలు పట్టడం వల్ల కలిగే అనర్థాలను తెలియజేస్తారు.
మూడో వారంలో స్కూళ్లు, అంగన్వాడీల్లో కూరగాయల పెంపకం వల్ల కలిగే లాభాలు వివరిస్తారు. నిపుణులతో గర్బిణులు, బాలింతలకు యోగా తరగతులు నిర్వహిస్తారు.
నాలుగో వారంలో ఆరేండ్లలోపు చిన్నారులను అంగన్వాడీ కేంద్రాలకు రప్పించి బరువు, ఎత్తు కొలుస్తారు. లోపాలుంటే నివారణ చర్యలు తీసుకుంటారు. తల్లులు, పిల్లల ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తారు.
అవగాహన కల్పిస్తున్నాం..
పోషకాహారం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించేలా పోషణ్ అభియాన్ మాసోత్సవం నిర్వహిస్తు న్నాం. నెల రోజులపాటు ప్రతి వారం ఒక్కో అంశంపై గర్భిణులు, బాలింతలకు అవగాహన కార్యక్రమాలు చేపడతాం. నాగర్కర్నూల్ జిల్లాలోని ఐ దు ప్రాజెక్టుల పరిధిలో 55,424 మంది సాధారణ ఆరోగ్యవంతులుగా ఉండగా, 47,529 మంది చిన్నారులు మధ్యస్త ఆరోగ్యంగా ఉ న్నారు. 504 మంది అతి తక్కువ బరువుతో ఉన్నారు. ప్ర స్తుతం సర్వే జరుగుతున్నది. 11 వేల మంది గర్భిణులు, బా లింతలకు అవగాహన కల్పిస్తున్నాం.