మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా మరిపెడ ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఎస్ఐను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. తనను ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి లైంగికంగా వేధించినట్లు అదే పోలీసు స్టేషన్‌కు చెందిన మహిళా ట్రైనీ ఎస్ఐ ఇవాళ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది.
నిన్న రాత్రి ఆకస్మిక తనిఖీ పేరుతో ఒంటరిగా అడవిలోకి తీసుకెళ్లి తనపై ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి లైంగిక దాడి చేసినట్లు బాధితురాలు ఫిర్యాదులో ఆరోపించింది. తనకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులతో కలిసి వరంగల్ పోలీస్ కమిషనర్‌ను ఆశ్రయించింది. దీంతో విషయంపై పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు. బాధితురాలు ఫిర్యాదు చేసిన విషయాన్ని వరంగల్ సీపీ తరుణ్ జోషీ సైతం ధ్రువీకరించారు. ఆరోపణలు నిజమైతే ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డిపై శాఖపరమైన చర్యలు తప్పవని ఆయన పేర్కొన్నారు.