వాషింగ్టన్ : కరోనా వైరస్ తీవ్రంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో మేధోసంపత్తి హక్కుల అడ్డంకులు తొలగించాలని అధికార డెమోక్రాటిక్ పార్టీకి చెందిన పది మంది ఎంపీలు కోరుతున్నారు. ఈ మేరకు వారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు లేఖ రాశారు. భారతదేశం, ఆఫ్రికా ప్రతిపాదనకు మద్దతు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. కరోనాను నివారించడానికి టీకా ఉత్పత్తికి భారత్, దక్షిణాఫ్రికాలతో సహకరించాలని వారు సూచించారు.
టీకా ఉత్పత్తికి మేధో సంపత్తి హక్కుల చట్టాలు అడ్డంకిగా ఉన్నాయని, వీటిని తొలగించడం వల్ల ప్రపంచంలోని అన్ని దేశాలకు కరోనా వ్యాక్సిన్ అందించేందుకు వీలుంటుందని భారత్, సౌతాఫ్రికా దేశాలు డబ్ల్యూహెచ్ఓకు ప్రతిపాదనలు చేశాయి.
ఈ నేపథ్యంలో మేధో సంపత్తి సంబంధ అడ్డంకులను తొలగించాలని సెనేటర్లు అధ్యక్షుడు జో బైడెన్‌ను డిమాండ్ చేశారు. ఈ అడ్డంకులు టీకా ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తూనే ఉన్నాయని వారు అభిప్రాయపడ్డారు.
ఈ డిమాండ్ పరిగణనలోకి తీసుకుంటే.. ప్రపంచంలోని కరోనా పరిస్థితిని నియంత్రించడంలో భారతదేశం ప్రయత్నాలు చాలా ముందుకు వెళ్తాయి. వాస్తవానికి, భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ ఉత్పత్తిదారుగా ఉన్నది. ఇక్కడ అన్ని రకాల టీకాలను తయారు చేస్తున్నారు.
వాస్తవానికి మేధో సంపత్తి హక్కుల వాణిజ్య సాపేక్ష కోణాల (టిప్స్) ను యూఎస్ కలిగి ఉన్నది. ఇది అమెరికాలో కనుగొనబడిన ఏదైనా ఔషధం లేదా ఇతర ఉత్పత్తిని విదేశాలలో తయారు చేయకుండా నిరోధిస్తుంది.
ఇలా ఉండగా, డెమోక్రాటిక్ పార్టీ ఎంపీలు అధ్యక్షుడు బైడెన్‌కు చేసిన వినతిపై రిపబ్లికన్ పార్టీకి చెందిన 18 మంది ఎంపీలు గుర్రుమంటున్నారు. ఈ ప్రతిపాదనలకు అనుమతి ఇవ్వకూడదని వారు డిమాండ్ చేస్తున్నారు. చట్టాన్ని సమర్థించాలని వారు జో బైడెన్‌ను అభ్యర్థించారు.
మేధో సంపత్తిని ఏకపక్షంగా ఉపయోగిస్తే, అమెరికా చాలా ప్రతికూలంగా ఉంటుందని వారంటున్నారు. ఇది పరిశోధనా సంస్థల పనిని కూడా ప్రభావితం చేస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా, దక్షిణాఫ్రికా దేశాల ప్రతిపాదనలకు అంగీకారం తెలుపొద్దని వారు డిమాండ్ చేస్తున్నారు.
రక్తం గడ్డకట్టకపోతే తీవ్ర ప్రమాదం.. చరిత్రలో ఈరోజు
బతుకుదెరువు కోసం ఆటో నడుపుతున్న జాతీయ బాక్సర్
టీకా ఆఫర్ : రిబెట్ ఇస్తున్న దుబాయ్ హోటల్స్
సముద్రంలో వందలాది పడవల మోహరింపు.. పరిస్థితిని సమీక్షిస్తున్న పీఎల్ఏ
భారత్‌లో బోరిస్ జాన్సన్ పర్యటన కుదింపు
జూన్ 1 నుంచి హాల్‌మార్క్ నగలే అమ్మాలి..
టీకా వేసుకోండి.. ఎక్కువ వడ్డీ పొందండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..