దళిత గుండెలో జ్వాలై నీవు
కులం కొరడాతో కొట్టిన గాయాల్లో
అణచివేత చీకటి అంచుల్లో
ఎవరు నీవు? దళిత గళానికి గొంతై
సమర శంఖం ఊదిన అంబేద్కర్ నీవు!
మట్టిలో మునిగిన మానవత్వానికి
నీ కలం రెక్కలు తొడిగింది
మందిర గడపలు మూసిన చోట
హక్కుల రాజ్యాంగం రాసిన యోధుడవు!
మనువాద గోడలను కూల్చడానికి
నీ గొంతు గర్జనై మార్మోగె
చావుకి చేరిన చేతులకు
విద్యా దీపం, స్వేచ్ఛా ఊపిరి ఇచ్చావు!
దళిత బిడ్డల కన్నీటి గాథలో
నీ పోరాటం ఒక నీలి ఆకాశం
అస్పృశ్యత అంటూ అడ్డుకున్న చోట
మానవ గౌరవ గీతం ఆలపించావు!
ఈ రోజు నీ ఆశయం నా రాగాల్లో
సమత జెండా నా గుండెలో
కలిసి నడిచే దారిలో, ఒకరినొకరు గౌరవిస్తూ
దళిత హక్కుల కోసం,
న్యాయం కోసం పోరాడతాం!
– రాము కోలా9849001201