కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏదీ?
మనదేశంలో 56 శాతం బీసీ జనాభా ఉన్నప్పటికీ వారికి బీసీ మంత్రిత్వశాఖ లేకపోవడం విచారించదగ్గ విషయం. మంత్రిత్వశాఖ లేకపోవడం వల్ల ఉద్యోగ, పదోన్నతుల్లో బీసీలు అన్యాయానికి గురవుతున్నారు.
మనదేశంలో 56 శాతం బీసీ జనాభా ఉన్నప్పటికీ వారికి బీసీ మంత్రిత్వశాఖ లేకపోవడం విచారించదగ్గ విషయం. మంత్రిత్వశాఖ లేకపోవడం వల్ల ఉద్యోగ, పదోన్నతుల్లో బీసీలు అన్యాయానికి గురవుతున్నారు. ఈ విషయమై అనేక ఏండ్లుగా ప్రధానులు,రాష్ట్రపతులను కలిసి వినతిపత్రాలు ఇచ్చి విజ్ఞాపనలు చేయడం జరిగింది. దీనిపై స్పందించిన వారు వీలైనంత త్వరగా బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇంత వరకు ఈ హామీ అమలుకు నోచుకోకపోవటం శోచనీయం.
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి ఎనిమిదేండ్లు గడిచినా బీసీ మంత్రిత్వశాఖ ఏర్పాటు అమలుకు నోచుకోలేదు. బీసీ అయిన నరేంద్రమోదీ దేశానికి ప్రధాని అయితే బీసీల సమస్యలు పరిష్కారమవుతాయని వారంతా ఎన్నో కల లు కన్నారు. కానీ, ఏ ఒక్క సమస్య పరిష్కారానికి నోచుకోలేదు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల ఎంపికకు ఓబీసీ సర్టిఫికెట్ పొందాలంటే తల్లిదండ్రుల వార్షికాదాయం, ఎనిమిది లక్షలు దాటరాదన్న నియమం ఉన్నది. మరోవైపు బీసీలను క్రిమిలేయర్, నాన్ క్రిమిలేయర్ అని విభజిస్తున్నారు. అయితే ఎస్సీ, ఎస్టీలకు ఈ నిబంధనలు లేవు. దీన్ని కేవలం బీసీలకే అమలు చేయడంలో ఆంతర్యమేంటని బీసీలు ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు తెలంగాణ ప్రభుత్వం బీసీ కులాలన్నింటికీ ఆత్మగౌరవ భవన నిర్మాణానికి స్థలాన్ని, డబ్బులను కేటాయించింది. బీసీ కులాలైన మంగలి, చాకలి కులాలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత విద్యుత్ను అందిస్తున్నది. గొల్ల, కురుమ కులాలకు గొర్రెలను పంపిణీ చేస్తూ ఆర్థికంగా ఆదుకొంటున్నది. రానున్న రోజుల్లో మాంసం విక్రయాలను ప్రభుత్వమే నిర్వ హించేలా చర్యలు చేపట్టింది. త్వరలో ప్రారంభించనున్న సర్కారీ మాంసం మార్కెట్లను తరతరాలుగా ఆ వృత్తిపై ఆధారపడిన ఆరె కటికలకు మాత్రమే కేటాయించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. గౌడ కులాలవారికి వృద్ధాప్య పింఛను, కల్లుగీత సమయం లో అనుకోని ప్రమాదాలు జరిగితే ఆర్థిక సహా యం, ఎక్స్ గ్రేషియాను ప్రభుత్వం అందిస్తున్నది. బీసీ విద్యార్థుల కోసం బీసీ గురుకులాలు, ప్రత్యేక హాస్టళ్లు ఏర్పాటు చేసింది.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కేంద్రంలో బీసీ మంత్రి త్వ శాఖను ఏర్పాటు చేయాలని పార్లమెంట్లో ప్రస్తావించారు. బీసీ సంక్షే మ సంఘం జాతీయ అధ్యక్షులు, ప్రస్తుత రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శి, ప్రస్తుత బీసీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహనరావు తదితరుల ను ప్రతినిధి బృందంగా ఏర్పాటు చేశారు. వారిని కేసీఆర్ నాటి ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు, సోనియాగాంధీతో సమావేశ పరిచారు. ఈ సందర్భంగా కేంద్రం లో బీసీ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాల్సిన అవసరం, ఆవశ్యకతను వారికి వివరించారు. వారు సానుకూలంగా స్పందించినా నేటికీ అది అమలుకు నోచుకోలేదు.
బీసీ కుల జనగణనను చేపట్టాలని, జనాభా ప్రకా రం రిజర్వేషన్లు అమలయ్యేలా చూడాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్నది. కానీ కేంద్ర ప్రభుత్వ చర్య లు ‘చెవిటి వారి ముందు శంఖం’ ఊదిన చందంగా ఉన్నది. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు గడిచినా ఇంకా చట్టసభల గడప తొక్కని కులాలు బీసీలలో అనేకం ఉన్నాయి. శాసనసభ, పార్లమెంటు ఎన్నికల సమయంలో బీసీల ఓట్లకోసం అనేక హామీలిచ్చే రాజకీయ పార్టీలు ఎన్నికల తర్వాత వాటిని అటకెక్కించడం పరిపాటిగా మారింది.
బీసీల్లోని అనేక కులాలు ఆర్థికంగా, సామాజికం గా, రాజకీయంగా, విద్యాపరంగా వెనుకబడి ఉన్నా యి. అందులోనూ రాజకీయ ప్రాతినిథ్యం లేని కులా లు కూడా ఎక్కువే. ప్రపంచీకరణ మూలంగా కులవృత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయి. బీసీ కులాలు ఆర్థి కంగా నిల దొక్కుకోవాలంటే వా రికి ఉపాధి నిచ్చే మార్గాలు అన్వే షించాలి. దీనికి బీసీ మంత్రి త్వ శాఖ ఏర్పాటు ఒక్కటే మార్గం. ఇప్పటికైనా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం స్పందించి బీసీ మం త్రిత్వ శాఖ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని బీసీ సంఘాలు డిమా ండ్ చేస్తున్నాయి.
(వ్యాసకర్త : తెలంగాణ రాష్ట్ర ఆరె కటిక ట్రస్ట్ వ్యవస్థాపక సభ్యులు, మీడియా కార్యదర్శి)
-డాక్టర్.ఎస్. విజయ భాస్కర్
92908 26988
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

