ఉద్యమం ఊపిరి పోసింది
సత్తువ సమరం
ఈ నేల వీరుల త్యాగం
మలిదశ ఉద్యమం
మనిషి మనిషి హృదయాల కదలిక స్మృతి
తరతరాలకు చరిత్ర తనువు తుడచలేనిది
ఊరురా ఉద్యమ చరిత్ర
పల్లె పల్లెల పాతిన నిలువు రాయి
జన హృదయాలలో ఎగరవేసిన
జగతిలో సమరం
మానవ సమాజం
మతి ఉన్నంతవరకు
మది మదిలో మెదిలే మానవ జీవం
సావుకైనా సిద్ధపడి సాధించిన తెలంగాణ
తలవంచని బిడ్డలు తల్లి తెలంగాణ పుత్రులు
అమరులు సమరయోధులు
అవనిలో అంతం లేని చరిత్ర వీరులు
– దేవరపాగ కృష్ణయ్య 99634 49579