గుండెను ఈదిన గొంతు మరిగిన మనసుతో అరిగిన బతుకులో నాలుక పారిన చోటల్లా మొలిచిన ప్రతి గుర్తు గద్దర్… మోసిన అనుభవాన్ని అక్షరంలో రంగరించి మెదడుకు రుచి చూపి చూపి పెలే పల్లవి మోతరా గద్దర్ నిప్పుల్ని నమిలి మింగి ముళ్లను వాటేసుకుని మట్టితో కలసి మెలసి మనిషిని గుండెలో ఈదిన ఈతరా గద్దర్ గుడిసె దిగులు గుబులు తెలిసి చెమట ఇంకిన బతుకు నడచి నలిగిన శరీరంలో పగిలిన ప్రతి కలను చూసి గొంతును ఆయుధంగా మోగిన గళం గద్దర్ ఎత్తిన గొంతులో వెలిగెత్తే ప్రశ్నలు కత్తిలా దూసుకుపోయే పదునైన ఆలోచనలు మెరుపులా తాకే చురుకైన శక్తులు పాటలో శక్తికి పట్టం కట్టిన వీరుడు గద్దర్…
– చందలూరి నారాయణరావు 97044 37247