తెలంగాణ గుండె దరువు తెగిపోని బంధమ్మువు
తెలంగాణ ఆత్మాభిమానమ్మువు ఆరిపోని దీపమ్మువు
తెలంగాణ పోరులోన అగ్గిని రాజిల్లినోడ కేసీఆర్
తెలంగాణ తెచ్చినోడ దీపం వెలిగించినోడ ॥తె॥
వీరత్వం, ధీరత్వం, నీ తత్వం విప్లవానికే వెలుగు
చెదిరిపోని గుండెనీది అదిరిపోని కాంతివి కేసీఆర్
నీకెవ్వరు ఎదురు కేసీఆర్ నీకు నువ్వే సాటివైతివి
తెలంగాణ బతుకులన్ని మొండిమాను
బతుకులాయెనాని ॥తె॥
ఎండిపోయిన చెరువులను చూసి కలత చెందినావు
పాడుబడ్డ నుయ్యిలన్నీ పాతరేసి పోయెనాని కేసీఆర్
కూలిన దేవాలయాలు రాలిన కోటలు
రైతుల బతుకులు చూసి వెతలు చెందినావు ॥తె॥
పోరుబాట పట్టినావు పోరాడి నిల్చినావు
ఉద్యమాలనే నిర్మించి జగత్తంత చల్లినావు కేసీఆర్
కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నిన్ను మించినోడు లేడు
తెచ్చిన తెలంగాణ నింపుకున్న ధీరత్వం ॥తె॥
నిలుపుకున్న పరువు సాటిలేని పోరాటం
వీరుడవై నిల్చినావు విజయాన్ని పొందినావు ॥తె॥
– డాక్టర్ సందినేని రవీందర్ 94910 78515