అతివృష్టి అనావృష్టి మధ్య ఆరుగాలం కష్టిస్తున్న కర్షకా!
గంజినీళ్ళనే పంచభక్ష్య పరమాన్నంగా భుజిస్తున్న హాలికా!
అందరిపొట్ట నింపి నీ పొట్ట మాడ్చుకుంటున్న సైరికా!
ఎండకు ఎండుతూ వానకు నానుతూ రేయింబళ్ళు శ్రమిస్తున్న శ్రామికా!
నడుంకట్టి హలం పట్టి సేద్యాన్ని చేస్తావు
నేల తల్లిని నమ్మి పుడమి తల్లిని పులకరింపజేస్తావు
ఎవరిపై ఆధారపడక అహరహం శ్రమిస్తావు
సిరుల పంటలెన్నో తీసి పలువురికి పంచుతావు
ఒకప్పుడు…
నీరు లేక నిరుత్సాహపడ్డావు,నకిలీ విత్తనాలతో నష్టపోయావు
ఆకాశాన్నంటిన ఎరువుల ధరలతో ఆవేదనచెందావు
దిగుబడి రాక అనుదినము దిగులు చెందావు
గిట్టుబాటు ధరలేక గిట్టుటే శరణ్యమనుకున్నావు
అందుకే…కె.సి.ఆర్ సారు
రైతే రాజనే మాటకు అడుగడుగున అండగా నిలిచినారు
బృహత్తర జలయజ్ఞాలతో పంటకు నీరందించి కంటనీరు తుడిచినారు
పసిడి పంటల సాగుకై రైతుబంధు నందించి రైతుబాంధవుడయ్యినారు
అకాల మరణానికి రైతు భీమానందించి ధీమాను కలిగించినారు
తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసినాడు
జనుల పాలిట నిండు పున్నమి చంద్రుడై వెలిగినాడు
చెరిగిపోని చరిత్రను తనపేరుతో లిఖించినాడు
పాలనా పటిమతో నాయకుడిగా గెలిచినాడు…
జనులందరి మనమునందున నిలిచినాడు…
జకు కృష్ణమూర్తిగౌడు
తెలుగు భాషోపాధ్యాయుడు,
ప్రభుత్వ ఉన్నత పాఠశాల
హుజూరాబాద్, కరీంనగర్ జిల్లా.
9912328949
9059674541