వినరండోయ్
రారండోయ్
అన్నీ మంచి శకునములే
రింఝం రింఝం తెలంగాణ
ఆడపిల్ల పుట్టుకిపుడు అదనపు ఆదాయమండోయ్
కెసిఆర్ కిట్టంటే బ్రూణ హత్యల సమాధియేనొయ్
రారండోయ్ వినరండోయ్
అన్నీ మంచి శకునములే
రింఝం రింఝుమ్ తెలంగాణ
షీ టీముల ప్రణాళికంటే బేటి బచావో బేఠీ పడావో కు ఆలంబనండోయ్
రారండోయ్ వినరండోయ్
అన్ని మంచి శకునములే
రింఝం రింఝుమ్ తెలంగాణ
కళ్యాణ లక్ష్మి రథ మిపుడు వరకట్నాన్ని పారదోలుతూ ఆడపిల్లల ఆత్మవిశ్వాసం గా శరవేగంతో కదులుతుందండోయ్ రారండోయ్ వినరెండోయ్
అన్నీ మంచి శకునములే
రిమ్ ఝమ్ తెలంగాణ
కంటి వెలుగుల పథకంలో స్వచ్ఛమైన
తెలంగాణ అదిగదిగో
రారండోయ్ వినరండోయ్
అన్నీ మంచి శకునములే
రింఝం రింఝం తెలంగాణ