అతనంటాడు నా భాష వేరు,
నా సంస్కృతీ వేరు
మరొకతనంటాడు-
నా సాంప్రదాయం
వేరు, నా కట్టుబొట్టు వేరు
ఒకడు మతం దేహానికి
చుట్టుకొని తిరుగుతుంటాడు
మరొకడు కులం తుండుగుడ్డను
భుజంపై మోస్తూ వుంటాడు
వారి వారి నీడలు
వారినంటిపెట్టుకునే ఉంటాయి
ఆత్మలు మాత్రం దేహాలను వదిలి మర్రి ఊడల్ని ఊయలగా
చేసుకుంటాయి
ఇప్పుడు-వాడ వాడలో, వీధి వీధిలో శవాల జాతరలే, ఊరేగింపులే
– డాక్టర్ రూప్ కుమార్ డబ్బీకార్ 99088 40186