నింగిపందిరై తెలంగాణ నేలను చూస్తుంది.
సేనులో సేద్యకాడు నిండు సందమామై మెరుస్తుండు.
అతడి సేతిలో పడ్డ అవని అంతా
పచ్చనిసీర ఆరేసినట్టు కనిపిస్తుంది.
ధరణిపై కాళేశ్వరం ఆకాశంలోని తెల్లని మేఘాల్లా.
సెరువు మత్తడులు.. జలపాతాల సవ్వడులు.
వడ్లరాసుల కుప్పలు.. తెల్ల బంగారం రాసులు.
అభివృద్ధి సంక్షేమం జోడెడ్ల బండ్లు.
అరవై ఏండ్ల కల నిజమైన దినం.
మళ్లీ కల కలలాగే కలల నీడలోకి వెళ్లింది.
పాలపొంగుల్లా పొంగిన నీటిధారలు ఎక్కడని
అవని అడుగుతుంది.
సేద్యంలో సేద్యకాడి చిరునవ్వు చిరునామా ఎక్కడని
సేను సెలక సిన్నబోయి చూస్తున్నయి
జింకపిల్లలా గెంతులువేస్తూ ఎగిరిన అభివృద్ధిని
ఏ పెద్దపులి ఎత్తుకపోయింది.?
ఆడబిడ్డల ఆసరా ఏమైంది.?
కన్నీరు తుడిచే కల్యాణలక్ష్మి
కన్నీరెందుకు కారుస్తుంది?
రైతుబంధు ఎందుకు అందని బంధువైంది
కాలం ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తున్నది.
అమరుల గుర్తుకు నిదర్శనం. ఈ తెలంగాణం.
త్యాగాల పుట్టిల్లు ఈ తెలంగాణం.
మరో ఉద్యమానికి వెనుకాడదు ఈ తెలంగాణం.
– అశోక్ గోనె 94413 17361