నాలుగు గోడలతో
కొంత వైశాల్యంలో
జీవిస్తున్న గదులే
నా ఇల్లూ నా బతుకూ
మొత్తంగా అదే నా స్పృహ
నా సృజన లోకం శ్వాస
బంధాలూ బంధువులూ ఎన్ని ఉన్నా
నా ప్రాణం గట్టి స్నేహాల తీరని దాహాలే
నా బతుక్కు పునాదులేసింది
బడి అక్షరాలూ తెర చిత్రాలు
అన్నీ చదివిన పుస్తకాలే
ఇల్లును మించిన ఇల్లు ఉంది
నా మనసులో కొత్త ఇల్లంటే
స్థల మార్పేనన్నది ఓ అనుభవం
బహుశా మాటా మంతీ మారదేమో
నిత్య సంతోషం చెదరని నవ్వే
నా బతుకు చిరునామా ఎప్పటికీ
హృదయ చలన లయలో రుధిరం
మృదుమధుర పూలదండలో దారం
కొత్త చెలిమి రావొచ్చు
అందమైన కవితల్లా
కానీ
పాత స్నేహాల ఊపిరిని
ఎటులైనా మరిచిపోతే
పాత ఇల్లు బంధం మరిచినటులే!
ఐతే మనిషి బతుకు
మనసు లేని గాలి తుదకు
డా॥టి.రాధాకృష్ణమాచార్యులు
98493 05871