సీ. హరితహారము బెట్టి హాయి గొల్పెడి రీతి పచ్చని చెట్లన్ని పరిఢవిల్ల కళ్యాణలక్ష్మిని కల్పించి పేదల ఆదరించెను తాను అందమొప్ప మెరుపు వేగముతోడ మిషను భగీరథ తెలగాణ దాహార్తి తీర్చివేసె గర్భిణీల కొరకు ఘనమగు కేసిఆర్ కిట్టును ఆందించి కీర్తి గాంచె నేతన్నలకును చేనేత పథకమిచ్చి సాయమ్ము నొనరించె చక్కగాను అన్నపూర్ణ పథక మందించి పేదల ఆకలి మంటల నార్పివేసె బతుకమ్మ చీరలు పంపిణీ జేయుచు ఆడబిడ్డల్ల నానందపరిచె కాళేశ్వరము కట్టి కాల్వలు త్రవ్వించి పచ్చని ప్రగతికై పాటు పడెను డబులు బెడ్రూములు దండిగాకట్టించి పేదవారల కిచ్చె పేర్మితోడ రైతుబంధును బెట్టి రైతుల లబ్ధికై సాయమ్ము జేసెడు సవ్యసాచి.
తే. వివిధ పథకాల నిర్మాణం విస్తరింప
జేసి తెలగాణకు మిగుల వాసి గూర్చి
నాడు నేడును తెలగాణ ఓడకుండ
ప్రగతి దారుల పయనించ్రి ప్రజలు తాము
తే. చెట్లు చిగురించె పచ్చగా చిక్కగాను
నీటి సౌకర్యము గలిగి నీళ్లు పార
రాష్ట్ర ముఖ్యమంత్రీ యయ్యె లక్షణముగ
చరిత వెలుగగా తెలగాణ చక్క బరిచె
– రావూరి వనజ 9491486275