ఉపదేశం విదుశ్శుద్ధం సంతస్త ముపదేశినః
శ్యామాయతే న విద్వత్సుయః కాంచన మివాగ్నిషు
అగ్ని పవిత్రమైనది. శుచియైన అగ్నియందు కాల్చబడిన సొక్కం బంగారం కూడ రంగు మారదు. అట్లే.. ఉత్తములైన గురువులు ఉపదేశించిన ఉత్తమ విషయ ముల వలన ఉత్తములైన విద్యార్థుల మనస్సులు మరింత ఉన్నతములుగ మారుతాయి. అంటే ఉత్తమ విద్యార్థులు రూపొందాలంటే ఉత్తమ గురువుల సాంగత్యం అవసరం.
టి.సుధాకరశర్మ