ఉగ్గబట్ట లేక..
ఊపిర్లను గొట్టంతో ఊదీ ఊదీ కుంపటినంతా భగభగ మండియ్యాల గప్పుడే బ్రతుకు ఆకళ్ళు రాజుకుంటాయి
ఊపిర్లను గొట్టంతో ఊదీ ఊదీ
కుంపటినంతా భగభగ మండియ్యాల
గప్పుడే బ్రతుకు ఆకళ్ళు రాజుకుంటాయి
పలుగు రాళ్ళతో పట్టెడ సానబెట్టినా
పని ఇగురం తెల్వకుంటే
మూసల బంగారం
బొగ్గుల్లోనే ఒలికి పోతది..
మనుషులు సుత అంతే
వెదురు బొంగుల్లెక్క
నిటారుగా ఎదగటం కాదు
కాసింత పొద్దు తిరుగుడు పువ్వులెక్క
కాలంతో తలకాయల్ని తిప్పుతుండాలి
సిరాకు మంటకు మొఖానికి
సెగ చిమ్మినట్టు
గుమ్మం ముందు బోర్లాపడే
రోజొకటి సెప్పకనే వస్తది
చిరుగుతున్న బతుకుని
మరింత చింపుకోవటం కాదు
బతుకు దారంతో కట్టుకుంటూ వుండాల
ఎప్పుడైనా పోరు ఫలం
తెర్లైపోకుండా
జాగర్త పడుతూ ఉండాల
సుఖం సుట్టం లెక్క వచ్చిపోతాంటది
కస్టం కావడిలెక్క భుజాన
ఊయల ఊగుతుంటది
నిబాయించుకోవాల
బొంగరంలెక్క గిర్రున తిరిగితే
ఫాయిదా ఏం వుంటది?
రంగులరాట్నం ఎక్కి
పపంచకం గిరగిర తిరుగుతాంది
అనుకోవటం వెర్రిబాగుల
తనం బిడ్డా…
మానాలకు మాశికలేసుకుంటున్న
కన్నీళ్ల పాయల్ని తరుము
ఎగిరే పిట్టల రెక్కల్ని
ఎవడో ఇరుస్తున్నడు చూడు
తెడ్డులెక్క నాలుకల్ని తిప్పితే
ఒడ్డుకు చేరుతాననుకోకు
ఇవ్వాళ మాటున దాగిన
మొఖాన్ని మళ్ళీ మళ్ళీ ఏం మూస్తావు
మూసుకున్న నీ లోపలి
దర్వాజ తెరువాలిగానీ…..
ఉచ్చితార్తంగా ఊపిరితీసే రకం కాదు మనది
నల్లికుట్లతనం లేనోల్లం మనం
పొగసూరిన గోడదగ్గర సుత
కందిలిదీపం వెలుతురే ఇస్తది
పొయ్యిల ఉప్పేసినట్లు
చిటపటలాడక
నువ్వు వెలగటం నేర్వు
తంగేడు పూలతో
బతుకమ్మ పేర్చినట్టు
నిన్ను నీవు శిఖరమోలే పేర్చుకో
ముద్దబంతి పూవోలే
నవ్వటం నేర్చుకో
సందడి తొవ్వకోసం
బతుకు బోనం ఎత్తుకో
ఇక్కడ ఏ వాక్యం
పురుడు పోసుకున్నా
తెలంగాణ గానమైనా…రణమైనా
ఉపశమనం లేకే…ఉగ్గబట్ట లేకే..
– డా.కటుకోఝ్వల రమేష్ 99490 83327
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

