పచ్చని వృక్ష సంతతియె ప్రాణులకున్
జవసత్వ మిచ్చు, దా
నిచ్చును భోజనాదులను,
యిచ్చును ఊపిరులూది జీవనం
బిచ్చు బడంగ జేయు వివిధాంచిత
జీవన యానమందు, యే
మిచ్చిన యీయకున్న సత మిచ్చును
జీవము ప్రాణ వాయువై!
ప్రజల కాహార భూతియై ప్రబలు కొరకు
ప్రజల ఆడంబరమ్ములు వసతి కొరకు
పట్టణమ్ముల నగరాల పల్లెలందు
వృక్ష సంపద వెలిసెను విరివిగాను!
అవివేక చిత్తులై అడవులు నరికేసి
పర్యావరణమును పాడు చేయ
ఫల పుష్పములు లేక ప్రాణ వాయువు లేక
ప్రజలు అల్లాడ నా వంత గాంచి
ప్రభుత కండ్లు దెరచి భవితను దర్శించి
హరిత హారము నిచ్చె నవని సతికి
హరిత హారంబుగా నవనిలో పేరొంది
తెలగాణ రాష్ట్రంబు విలువ బెంచి
నిత్య విభవమ్ము గూర్చగా సత్య నిష్ఠ
వృక్ష సంతతి బెంచంగ విమల మతులు
దక్షులైనట్టి నేతలు దీక్ష బూని
బెంచ వృక్షాళి పచ్చనై వెలిగె పృథివి!
ప్రభుత, అధికార వర్గంబు, ప్రజలు కలసి
హరిత హారంబు ఉత్సవం బనగ యేచి
నిర్వహింపంగ కనులకు పర్వమయ్యె
తన్మయంబందె భూమాత తాపమార!
-పాలకుర్తి రామమూర్తి
73309 23552