బుర బుర పండిన పండు
పిల్లకాయల కోసం
పరితపిస్తున్నది
ఎండిన ఆకు
వెన్నుపూస వంగిపోయి
బొక్కలు చీకిపోయి
నరాలు తేలినా
కన్నబిడ్డల కడుపు విచారిస్తున్నది
వయసు భారమై
కడుపుల పేగులు కాటికైనా
నొప్పుల రాగాలు పలికినా
బిడ్డల మీదే పానమంతా
ఆకాశమంత ప్రేమను
కోడిగుడ్డంత అన్నంగా కలిపి
గోరు ముద్దలు పెట్టిన అవ్వ
గోటితో విసిరే
నాలుగు గింజల కోసం
ఎదురుచూస్తున్నది
అవ్వంటే…
ఇంటి పెద్ద దర్వాజా
కురాటి కుండ
పెద్ద తాంబాలం
అవ్వను మరిస్తే
ఇల్లు మబ్బు మబ్బే…
బొల్లం బాలకృష్ణ
99897 35216