తొలుసూరు నలుసుకేమో
ఎదురుచూసె స్వాతమ్మ..
ఆ మురిపెం ముంచేసి
పైశాచికానందం..
సిందూరం అద్దినపుడు
చందమామ అందమనే….
కడకేమో పిచ్చి కథలు
నాటకాలు రక్షకులకు..
నువ్వాడిన ఆటలో
అబార్షన్ల మోసమొకటి..
వేప చేదు తీయనైతే
నీ గుండెనేమో కుళ్లె సూడు..
కాలం సల్లిన అక్షింతలు
శ్రీమంతం ఆరాటం
చితి మీదికి నీ ఆశలు..
నీ ఊసులు, బాధలన్నీ
అయినోళ్లకు దూరంగా..
ఉంటుందా దయనీయం
ఎందుకొచ్చే ఈ కష్టం..!
చేత కాని ప్రేమతోటి
చెడిపోయిన మనసుతోటే
నూరేళ్లు అనుకుంటివి..
ప్రేమెట్లా మాసిందో
తుంచె వాడు ఆశలన్నీ..!
అసమానం ఆమె బాస
అనుమానం నీ ఆటాయే
నరరూప రాక్షసుడా
విష నాగుల ‘కాటు నయం’..!
పక్క సుఖం ఎరిగినపుడు
అడ్డు రాని కుల గోడలు
పుట్టెబిడ్డ కెట్లొస్తయ్?
చట్టముండే, శిక్షలుండే
నాకెందుకు అనుకోకు
రేపు నీ వొంతే కావొచ్చు..!
ఆది, అంత్య ఈ సృష్టి
ఇంతేనా? ఇంతేనా?
రాబంధుల చెండాడ
రగిలే జ్వాలై రావమ్మా
ఓ బంగరు చెల్లెమ్మ..
– సురేంద్ర బండారు 90108 47120