నా తోడుగ నీవుంటే
స్వర్గము నా కెందుకూ
నాతో నువు లేని ఏ
స్వర్గము నా కెందుకూ ॥నాతో॥
నీ అందమైన నగుమోమూ
నా యెదుటే ఉండగా
నింగిలోని చందమామ
బింబము నాకెందుకూ ॥నాతో॥
గల గల గల మాటలాడె
నీవే ఇట నుండగా
పారుతున్న సెలయేరుల
పదనిస నాకెందుకూ ॥నాతో॥
నీ మాటల మార్దవమూ
నాతోనే ఉండగా
వినసొంపగు సంగీతపు
సరిగమ లింకెందుకూ ॥నాతో॥
నీ ఉనికే మరువలేని
ప్రశాంతతను ఇవ్వగా
నిశ్శబ్దపు పూలతోట
గాలులు నాకెందుకూ ॥నాతో॥
ఆమెతోడి జీవితమే
అందముగా నుండగా
ఇంద్రధనుసు రంగులింక
దామూ నీ కెందుకూ ॥నాతో॥
– గిరిమాజి దామోదర్ 99663 36960