ఎక్కడో ఒక చోటనిలకడే దాని అస్తిత్వం
పనిగట్టుకొని ఎవరికీఎప్పుడూ ఏ పాఠం చెప్పదు
దాని ఆచరణ శీలతేనేను నేర్చిన పాఠం
కొన్నికొన్ని సందర్భాలుమనకంతగా అర్థం కావు
అది ఊగితే గాలొస్తుందా?గాలొస్తే అది ఊగుతుందా?
నిలకడ సాధించనిదితత్వం బోధపడదు
ఆకులు రాలుతున్నా అది వగపు గీతాలాలపించదు
కాసిన కాయలపై రాయి విసిరినాకసితో ప్రతి హింసకు పూనుకోదు
రాచి రంపాన పెట్టినానరికి కుప్పలు వేసినా కన్నెర్ర జేయదు
ఎన్ని సార్లు ధ్వంసం చేసినాచిగురు దరహాసమే సమాధానం
పగవాడు అలసివచ్చినాఆతిథ్యంలో తేడా చూపదు
పక్షి, పాము, సీతాకోకచిలుక ఏదైనా ఒకటే భుజాల మీద ఊరేగింపే
బోధి వృక్షం కింద కూర్చుంటేబుద్ధొస్తుందా అంటే బుద్ధుడే సాక్షి!
ఉపకారం తప్ప ఏ అపకారం చేయకపోతేనే చెట్టంత మనిషంటారు!
కోట్ల వెంకటేశ్వరరెడ్డి
94402 33261