నిశ్చలంగా ఉన్నా
అలలై ఎగసిపడుతున్నా…
జ్ఞాపకాల కెరటాలతో
ఎగిరి పడుతున్నా…
ఆలోచనల స్వాంతనతో
ప్రశాంతంగా ఉన్నా…
కదిలిస్తే అది కల్లోలం
హద్దుదాటితే ఉపద్రవం!
అయినా నిండు కుండై
గుమ్మనంగ ఉంటుంది
ఎంత విశాలం?
ఆమె హృదయ సంద్రం
నేనిచ్చిన వేదనను
తను దిగమింగి నా దరికి చేరి
తెల్లగా మల్లె పువ్వులా నవ్వుతుంది!
ఆటుపోట్ల అలజడిని…
తన హృదయంలో దాచుకుని
ఆత్మీయత పంచే
అమ్మలా తన అంతరంగంలో
నాకు చోటిస్తుంది!!
సముద్రమంత విశాల దృక్పథం
ఆమె….
ఎన్. లహరి
98855 35506