నాలుగు దెబ్బలు కొట్టినట్లే ఉండే
మా బతుకులు ఆనాడు..!
ఉప్పునీళ్లకే ఊరంత తిరిగినం…
కండ్ల నీళ్లతోనే మా ఇంటి కుండలు నిండేయి..
ఇంటి పెంకులు చూసింది
మేం తిన్న కంచంల కారం మెతుకులను..!
ఆకిట్ల నాలుగు గుంజల పందిరికెర్క
మేము ఎన్నివాట్ల దానికింద పన్నమో …
అరుగుబండ ఏడ్చింది
మేము వడ్డ అరిగోసలు చూసి..!
జోలెవడ్డ నుల్కమంచంల నడుమాన్షినట్లు…
రోజురోజుకీ అడుక్కే పోయినమని…
జోడెడ్ల లెక్క రంకెలేయ లేదు రైతన్నల బతుకులు
చేతుల పైసల్లేక… గుమ్మిల అడ్లు నిండక..
ఏండ్లకేండ్లు దుఃఖం
బండి చక్రమోలె తిరుగుతాంటె…
కలవడ్డోడె అచ్చి మా కష్టాలను
కట్టెవట్టి గెదిమిగొట్టి..
కడుపు నింపే పథకాలు
మా ఇస్తార్ల వడ్డించిండు మా సారు..
మంచోన్ని మంచం కూడా ఓర్వదన్నట్లు…
పాలోడే పగోడైనట్లు
ఇంట్లోడే దొంగలను పంపినట్లు…
తెలంగాణ మీద నిప్పులేసి సలికాసుకునుడే కానీ..
పేదోన్ని పెద్దగ చేసుడు రాదు..
చేసుకచ్చెటోని కాళ్లల్ల కట్టెవెట్టి.. కనికట్టు కతలల్లి.. మీరెన్ని రీల్స్ చేసిన
తెలంగాణ స్క్రీన్ మీదుండేది కేసీఆర్ బొమ్మే
తెలంగాణ తల్లిని తన భుజం మీద మోస్తే..
ఇప్పుడు భారతమాతను నెత్తినెత్తుకొని నడిచేది మా చంద్రశేఖరుడే..!
-తుమ్మల కల్పనా రెడ్డి
9640462142