JR NTR | సినిమాకు హ్యాట్సాఫ్.. ‘దండోరా’పై ప్రశంసలు కురిపించిన జూనియర్ ఎన్టీఆర్
JR NTR On Dhandoraa | తెలుగులో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు ప్రశంసలు అందుకున్న 'దండోరా' (Dhandoraa) సినిమాపై ప్రశంసల వర్షం కురిపించాడు అగ్ర కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్.
JR NTR On Dhandoraa | తెలుగులో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు ప్రశంసలు అందుకున్న ‘దండోరా’ (Dhandoraa) సినిమాపై ప్రశంసల వర్షం కురిపించాడు అగ్ర కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు. ‘ఇప్పుడే దండోరా (Dhandoraa) సినిమా చూశాను. ఇది ఎంతో లోతైన, శక్తివంతమైన మరియు ఆలోచింపజేసే చిత్రం. శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, బిందు మాధవిలు తమ నటనతో సినిమా ఆద్యంతం అద్భుతంగా రాణించారు. ఇంతటి బలమైన రచనతో, మన మూలాలకు దగ్గరగా ఉండే కథను ఎంతో చక్కగా తెరకెక్కించిన దర్శకుడు మురళీ కాంత్ గారికి నా హ్యాట్సాఫ్. ఇలాంటి గొప్ప ప్రయత్నాన్ని ప్రోత్సహించి, నిర్మించిన రవీంద్ర బెనర్జీ గారికి అభినందనలు. ఈ గొప్ప చిత్రంలో భాగమైన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు.’ అంటూ జూనియర్ ఎన్టీఆర్ రాసుకోచ్చాడు.
అయితే ఎన్టీఆర్ లాంటి గ్లోబల్ స్టార్ నుంచి ప్రశంసలు అందడంతో చిత్ర యూనిట్ అమితానందంలో మునిగిపోయింది. “ఎన్టీఆర్ అన్న నా పేరు పలికారు, ఇది నాకు చాలు” అంటూ దర్శకుడు మురళీ కాంత్ భావోద్వేగానికి లోనవ్వగా, నిర్మాత ఇది తమకు అసలైన విజయం అని సంతోషం వ్యక్తం చేశారు. గతేడాది డిసెంబర్ 25న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఎన్టీఆర్ ప్రశంసలతో ఈ సినిమాకు ఒక్కసారిగా విపరీతమైన క్రేజ్ పెరగడమే కాకుండా, ప్రస్తుతం ఇండియాలో అమెజాన్ ప్రైమ్ టాప్-2లో ట్రెండింగ్‌లో నిలుస్తూ రికార్డు సృష్టిస్తోంది.
Just watched #Dhandoraa. Deeply thought-provoking and powerful. Outstanding performances by Sivaji garu, Navdeep, Nandu, Ravi Krishna and Bindu Madhavi throughout…
Hats off to director Murali Kanth garu for the strong writing and for executing such a rooted story so well.…
— Jr NTR (@tarak9999) January 19, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

